|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ కలిపి సినిమా! కృష్ణంరాజు డ్రీమ్ రీమేక్‌తో బిగ్ ట్విస్ట్!!

Published: 10-01-2026, 6:30 AM
షాకింగ్: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ కలిపి సినిమా! కృష్ణంరాజు డ్రీమ్ రీమేక్‌తో బిగ్ ట్విస్ట్!!
  • పెద్దమ్మ శ్యామలాదేవి కల: `మనవూరి పాండవులు` రీమేక్‌లో ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్!
  • కృష్ణంరాజు గారి సూపర్ హిట్ మూవీని రీమేక్ చేయాలనీ పెద్దమ్మ కోరిక.
  • ప్రభాస్ చేతిలో ప్రస్తుతం `ది రాజా సాబ్`, `ఫౌజీ`, `స్పిరిట్‌` సినిమాలు ఉన్నాయి.
  • రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి చేసిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం ఎంతటి విజయం సాధించిందో చూసాం కదా!

టాలీవుడ్ లో ఒక సంచలనం! రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి భార్య శ్యామలాదేవి గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో `మనవూరి పాండవులు` రీమేక్ చేయాలనీ ఆమె కోరిక. ఇది నిజంగా ఒక భారీ మల్టీస్టారర్ సినిమా అవుతుందా?

శ్యామలాదేవి డ్రీమ్ ప్రాజెక్ట్ వెనుక అసలు కథేంటి?

ప్రభాస్‌ ప్రస్తుతం `ది రాజా సాబ్‌` చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ మూవీ ఈ శుక్రవారమే ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. కానీ బాక్సాఫీసు వద్ద మొదటి రోజు మంచి వసూళ్లని సాధించింది. వంద కోట్లు చేసిందని ట్రేడ్‌ సైట్లు ప్రకటించాయి. చిత్ర బృందం మాత్రం రూ.112కోట్లుగా తేల్చింది. ఇదిలా ఉంటే ప్రభాస్‌ కి సంబంధించిన తన డ్రీమ్‌ ని వెల్లడించింది పెద్దమ్మ శ్యామలాదేవి.

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఇప్పుడు ప్రభాస్‌ పెళ్లి చేసే పనిలో ఉంది. ఆమె ఇటీవల గుళ్లు గోపురాలు తిరిగింది. కానీ ప్రభాస్‌ చేతిలో ఐదారు సినిమాలున్నాయి. ఇప్పట్లో ఆయన పెళ్లి చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో శ్యామలాదేవి ప్రభాస్‌ సినిమాలకు సంబంధించిన తన కోరికని బయటపెట్టింది. తన డ్రీమ్‌ ప్రాజెక్ట్ ఒకటి ఉందట. భారీ మల్టీస్టారర్ మూవీ చేస్తే బాగుండని, ఎప్పుడూ ఆ ఆలోచనలో ఉంటుందని చెప్పింది శ్యామలాదేవి.

ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ కలిసి సినిమా సాధ్యమేనా?

కృష్ణంరాజు నటించిన హిట్‌ మూవీస్‌లో `మనవూరి పాండవులు` మూవీ పెద్ద హిట్‌. చిరంజీవికి ప్రారంభంలో మంచి గుర్తింపు తెచ్చిన చిత్రమిది. ఇందులో కృష్ణంరాజు హీరో. సినిమాలో ఆయన పాత్రనే చిరంజీవి, మురళీమోహన్‌ వంటి కుర్రాళ్లలో పోరాట స్ఫూర్తిని రగిలిస్తారు. అప్పట్లో విశేషంగా ఆదరణ పొందిన ఈ మూవీ అంటే శ్యామలాదేవికి ఇష్టమట. అయితే ఇప్పుడు ఈ మూవీ రీమేక్‌ చేస్తే చూడాలని ఉందని చెప్పింది ప్రభాస్‌ పెద్దమ్మ.

ప్రభాస్‌.. కృష్ణంరాజుగారి మూవీస్‌లో `మనవూరి పాండవులు` మూవీని రీమేక్‌ చేస్తే చూడాలని ఉందని ఆమె వెల్లడించింది. ఇప్పుడు ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ఇలా అంతా కలిసి ఈ మూవీ చేస్తే అద్భుతంగా ఉంటుంది.  కానీ అది ఎంత వరకు అవుతుందో ఏమో అని చెప్పింది. ఇప్పుడు ప్రభాస్‌, రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ పాన్‌ ఇండియా హీరోలుగా రాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరు ముగ్గురు కలిసి సినిమా చేయడం అసాధ్యం. ఆ మధ్య ఎన్టీఆర్‌, చరణ్‌ కలిసి చేసిన `ఆర్‌ఆర్‌ఆర్‌` విషయంలోనే ట్రోల్స్ నడిచాయి. మరి ఈ ముగ్గురుని హ్యాండిల్‌ చేయడం చాలా కష్టం. ఊహించడం కూడా కష్టం. కానీ ఊహ మాత్రం అదిరిపోయింది. ఒకవేళ ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే మాత్రం అది ఇండియన్‌ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ కాబోతుందని చెప్పొచ్చు.

`మనవూరి పాండవులు` రీమేక్‌లో ఎవరు నటిస్తే బాగుంటుంది?

ఇక ప్రభాస్‌ లేటెస్ట్ మూవీ `ది రాజాసాబ్‌` థియేటర్లలో సందడి చేస్తుండగా, ప్రభాస్‌ ప్రస్తుతం `ఫౌజీ`, `స్పిరిట్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆ తర్వాత కల్కి 2`, `సలార్‌ 2`, ప్రశాంత్‌ వర్మ మూవీస్‌ చేయాల్సి ఉంది. మరోవైపు రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` సినిమాలో నటిస్తున్నారు. ఇది మార్చిలో విడుదల కానుంది. అలాగే సుకుమార్‌ మరో స్క్రిప్ట్ తో రెడీగా ఉన్నారు. ఎన్టీఆర్‌ ఇప్పుడు `డ్రాగన్‌` మూవీలో నటిస్తున్నారు. అనంతరం త్రిక్రమ్‌తో సినిమా ప్లాన్‌ ఉంది. అలాగే నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తోనూ ఓ మూవీ ఉందని సమాచారం.

మొత్తానికి శ్యామలాదేవి గారి కల టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ ల కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.