
📌 Key Points
- నిధి అగర్వాల్ ‘#Ask Nidhhi’ పేరుతో ‘X’లో ఫ్యాన్స్‌తో ప్రత్యేకంగా ముచ్చటించింది.
- ఓ నెటిజన్ అడిగిన ‘తెలుగులో మీ డ్రీమ్ మల్టీస్టారర్ ఏంటి?’ ప్రశ్నకు నిధి స్పందించింది.
- ప్రభాస్, పవన్ కల్యాణ్ హీరోలుగా, తను హీరోయిన్‌గా నటించాలని నిధి కోరుకుంది.
- ఈ డ్రీమ్ మల్టీస్టారర్ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాలని ఆకాంక్షించింది.
హీరోయిన్ నిధి అగర్వాల్ ఇటీవలే ఫ్యాన్స్‌తో నిర్వహించిన #AskNidhhi సెషన్‌లో తన డ్రీమ్ మల్టీస్టారర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించాలని, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాలని ఆమె చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిధి అగర్వాల్ #AskNidhhi సెషన్
యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. సవ్యసాచి సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది రీసెంట్‌గా పవర్ స్టార్ ప్రభాస్ నటించిన హరిహర వీరమల్లు సినిమాతో మనమందుకు వచ్చింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీలో నటిస్తోంది. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.
దీంతో ప్రమోషన్లలో భాగంగా నిధి ‘#Ask Nidhhi’ పేరుతో ‘X’లో ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు క్రేజీ ఆన్సర్స్ చెప్పారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ ‘నిధి తెలుగులో మీ డ్రీమ్ మల్టీస్టారర్ ఏంటి?’ అని ప్రశ్నించగా… ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోలుగా… తాను హీరోయిన్‌గా ఉంటే సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్ అయితే బాగుంటుందని ఆన్సర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక దీనిపై నెటిజన్లు రియల్‌గా ఇది సాధ్యం కాని కాంబో బట్ అయితే క్రేజీ ఉంటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
డ్రీమ్ మల్టీస్టారర్ కాంబినేషన్ ఇదే!
వైరల్ అవుతున్న నిధి ఆన్సర్
నిధి అగర్వాల్ డ్రీమ్ మల్టీస్టారర్ కాంబినేషన్ నిజంగానే అసాధ్యమని, అయితే అది సాధ్యమైతే మాత్రం సినిమా చరిత్రలోనే క్రేజీయెస్ట్ కాంబో అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.


