|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పూరీ సృజనాత్మకతకు ప్రభాస్ జేజేలు! ఏక్ నిరంజన్ డైలాగులపై ఆసక్తికర వ్యాఖ్యలు!

Published: 20-02-2026, 10:05 AM
  • పూరీ జగన్నాథ్ టాలీవుడ్‌లో డ్యాషింగ్ డైరెక్టర్ అని ప్రభాస్ కొనియాడారు.
  • ‘వర్షం’ దర్శకుడి కుమారుడి సినిమాకు సపోర్ట్ చేయడానికి ప్రభాస్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
  • ‘ఏక్ నిరంజన్’ సినిమాలోని హీరోయిజం, డైలాగ్స్ అంటే ప్రభాస్‌కి చాలా ఇష్టమట.
  • పూరీ జగన్నాథ్ హీరో పాత్రలను డిజైన్ చేసినంత బాగా ఎవరూ చేయలేరని ప్రభాస్ అన్నారు.

ప్రభాస్, పూరి జగన్నాథ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ లా ఎవరూ రాయలేరని, ఆయన సినిమాలంటే తనకెంతో ఇష్టమని అన్నారు. ముఖ్యంగా ‘ఏక్ నిరంజన్’ సినిమాలోని డైలాగులను గుర్తు చేసుకున్నారు.

పూరీ జగన్నాథ్‌పై ప్రభాస్ ప్రశంసలు

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డ్యాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ఎవరంటే.. వెంటనే వినిపించే పేరు పూరీ జగన్నాథ్ (Director Puri Jagannadh). ప్రస్తుతం ఆయనకు సరైన ప్రాజెక్ట్ పడక, అలా వెనుకబడిపోయారు కానీ, లేదంటే.. మొదటి పాన్ ఇండియా సెన్షేషన్‌గా ఆయన పేరు వినబడాల్సింది. దర్శకధీరుడు రాజమౌళి, సుకుమార్ వంటి వారు కూడా బాగా ఇష్టపడే దర్శకుడు పూరీ జగన్నాధ్. ఇప్పుడు దర్శకుల్లో హీరోయిజాన్ని చూపించాలంటే పూరీ తర్వాతే ఎవరైనా? ఈ విషయాన్ని స్వయంగా డార్లింగ్ ప్రభాస్ కూడా అంగీకరించారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. తనకు ‘వర్షం’ వంటి సినిమాను ఇచ్చిన దర్శకుడి కుమారుడైన సంతోష్ శోభన్‌ సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly)కి సపోర్ట్ చేసేందుకు ఓ ఇంటర్వ్యూని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో పూరీ ప్రస్తావనను సంతోష్ తీసుకొచ్చారు.

ఏక్ నిరంజన్ సినిమా గురించి ప్రభాస్ ఏమన్నారంటే?

తనకు ‘ఏక్ నిరంజన్’ సినిమా అంటే ఎంతో ఇష్టమని, అందులో ఉండే హీరోయిజం చాలా వెరైటీగా ఉంటుందని, ఈ సినిమా అంటే నాకు పిచ్చి అని, అందులోని డైలాగ్స్ కొన్ని చెప్పారు. వెంటనే అందుకున్న ప్రభాస్, తను పూరీతో చేసిన ‘బుజ్జిగాడు’ (Bujjigadu), ‘ఏక్ నిరంజన్’ (Ek Niranjan) సినిమాలంటే తనకు కూడా చాలా ఇష్టమని చెప్పారు. ప్రభాస్‌కు మంచి పేరు, ఇమేజ్ తెచ్చిన సినిమాలంటే ముందు వరసలో ఉండేది మాత్రం ఈ రెండు సినిమాలే. ఇందులో ప్రభాస్ హీరోయిజాన్ని పూరీ ఎలివేట్ చేసిన తీరు, ఆయనకు ఫ్యాన్స్‌ని సాధించి పెట్టింది. సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టి ఉండవచ్చు కానీ, ఇందులో ప్రభాస్ ఎనర్జీకి అంతా ఫిదా అవ్వాల్సిందే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.

ప్రభాస్ ఇష్టమైన సినిమాలు

ఈ సందర్భంగా పూరీ రైటింగ్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. పూరీగా ఎవడూ రాయలేడు. ‘బుజ్జిగాడు క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకు నిజంగా పిచ్చెక్కిపోయింది. ముందు భయం కూడా వేసింది. ఇలాంటి పాత్రను నేను చేయగలనా? అని. అప్పట్లో నేను ఏం మాట్లాడినా, ఆ సినిమా వెర్షన్‌లోనే మాట్లాడేవాడిని. అంతగా ఆ సినిమాకు నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఆయన డిజైన్ చేసినట్లుగా హీరో పాత్రను ఎవ్వడూ డిజైన్ చేయలేరు. తర్వాత మా నుంచి ‘ఏక్ నిరంజన్’ సినిమా వచ్చింది. ఆ సినిమాలో పాత్ర కూడా చాలా టిపికల్‌గా ఉంటుంది. పూరి రైటింగ్‌ని ఇమిటేట్ చేయడం కూడా ఎవరి వల్లా కాదు. ‘ఏక్ నిరంజన్’ సినిమాలోని కొన్ని డైలాగ్స్‌ని పూరీకి సోనూసూద్ ఫోన్ చేసి మేం వాడుకుంటామని అడిగారు. తను అసలే సూపర్ కూల్.. వెంటనే ఓకే అనేశారు. ‘దబాంగ్’లో ‘ఏక్ నిరంజన్’ సినిమా డైలాగ్స్ కొన్ని వాడారు’’ అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

మొత్తానికి ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. పూరి జగన్నాథ్ టాలెంట్ గురించి ప్రభాస్ గొప్పగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.