|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ ‘రాజాసాబ్’ రెండో సింగిల్ వచ్చేసింది: డార్లింగ్ లుక్స్‌పై ఫ్యాన్స్‌లో అంచనాలు!

Published: 17-12-2025, 10:44 AM
  • ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి రెండో సింగిల్ ‘సహన సహన’ విడుదలైంది.
  • మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.
  • థమన్ సంగీతం అందించగా, కృష్ణ కాంత్ సాహిత్యం రచించారు; విశాల్ మిశ్ర, శృతి రంజని ఆలపించారు.
  • పాటలో ప్రభాస్, నిధి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ, నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి.

ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా నుంచి రెండో సింగిల్ ‘సహన సహన’ విడుదలైంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎంటర్టైన్మెంట్ చిత్రంలో ప్రభాస్ లుక్స్ అదుర్స్ అని ప్రశంసలు అందుకుంటున్నాయి. తమన్ అందించిన సంగీతంలో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

రాజాసాబ్ రెండో సింగిల్ వచ్చేసింది!

The RajaSaab Song : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన సినిమాలన్నిటిలో కూడా ప్రభాస్ ఎక్కువ శాతం సీరియస్ గానే కనిపించాడు. బాహుబలి సినిమా ప్రభాస్ కెరియర్ కి ఎంత ప్లస్ అయింది అనేది చాలామంది ప్రస్తావిస్తారు. కానీ ఆ సినిమా తర్వాత కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడం మానేశారు. ఇది మాత్రం చాలా తక్కువ మంది గుర్తిస్తారు.

మారుతి దర్శకత్వంలో ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా ది రాజా సాబ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాల ఉన్నాయి. ఈ సినిమా జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు రానుంది. సినిమా రిలీజ్ కి దాదాపు మూడు నెలల ముందుగానే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ వేలు డిజైన్ చేశాడు మారుతి.

సహన సహన పాట విశేషాలు

అయితే ఈ సినిమా నుంచి సాంగ్స్ మాత్రం లేట్ అవుతూ వచ్చాయి. మొత్తానికి ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చి కొంత మేరకు బాగానే ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

సహన సహన అనే ఈ మెలోడీ సాంగ్ బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ప్రేక్షకులు ఈ పాటను ఎంత మేరకు ఆదరిస్తారు అనేది తెలియాలి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విడుదలైన మెలోడీ సాంగ్ను కృష్ణ కాంత్ రచించారు. విశాల్ మిశ్ర మరియు శ్రుతిరంజిని ఈ పాటను ఆలపించారు.

ప్రభాస్ లుక్స్‌పై ప్రత్యేక దృష్టి

ఈ సినిమా గురించి టాపిక్ నడుస్తున్న అప్పటినుంచి కూడా అందరూ ఏకకంఠంతో చెప్పేది ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ అదిరిపోయాయి అని. ముఖ్యంగా ఈ పాటలో కూడా ప్రభాస్ లుక్స్ నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తున్నాయి. ప్రభాస్ నిధి అగర్వాల్ మధ్య జరిగే ఈ సాంగ్ ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. కంప్లీట్ వీడియో సాంగ్ లో రిలీజ్ చేయడం అనేది సినిమాకి మంచి ప్లస్ అయ్యేట్లు ఉంది. ఈ సినిమాలో వీరిద్దరు బ్యూటీ తో పాటు నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

మొత్తంగా, ‘ది రాజాసాబ్’ నుంచి విడుదలైన రెండో పాట “సహన సహన” శ్రోతలను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రభాస్ విభిన్నమైన లుక్స్, ఆకట్టుకునే లొకేషన్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.