|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిన్నప్పటి ఫ్రెండ్స్ కి దగ్గరగా.. హోంబలే ఫిల్మ్స్ తో మూడు సినిమాలు చేయడానికి కారణం బయటపెట్టిన ప్రభాస్‌

Published: 16-07-2025, 9:09 AM
చిన్నప్పటి ఫ్రెండ్స్ కి దగ్గరగా.. హోంబలే ఫిల్మ్స్ తో మూడు సినిమాలు చేయడానికి కారణం బయటపెట్టిన ప్రభాస్‌

ప్రభాస్ తన భవిష్యత్ సినిమా ప్రణాళికల గురించి హాలీవుడ్ రిపోర్టర్ తో మాట్లాడుతూ, హోంబలే ఫిల్మ్స్ తో మరో మూడు సినిమాలు చేయనున్నట్లు వెల్లడించాడు. విజయ్ కిరగందూర్ తో ఉన్న అనుబంధం, పనితీరు ఈ నిర్ణయానికి కారణమని తెలిపాడు.

Key Points

1

ప్రభాస్ హోంబలే ఫిల్మ్స్ తో మూడు సినిమాలు చేయబోతున్నారు.

2

విజయ్ కిరగందూర్ తో ఉన్న స్నేహం, పనితీరు ఈ నిర్ణయానికి కారణం.

4

హోంబలే ఫిల్మ్స్ యొక్క క్వాలిటీ ప్రొడక్షన్ ప్రభాస్ ని ఆకర్షించింది.

హోంబలే ఫిల్మ్స్ తో ప్రభాస్ భవిష్యత్ సినిమాలు

ప్రభాస్‌ నెక్ట్స్ నాలుగైదు సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఏకకాలంలో `ది రాజాసాబ్‌`, `ఫౌజీ` చిత్రాలు చేస్తున్నారు. అనంతరం సందీప్‌రెడ్డి వంగాతో `స్పిరిట్‌` మూవీ ప్రారంభించాల్సి ఉంది.

అలాగే ప్రశాంత్‌ వర్మతో సినిమా చేయనున్నారు. ఇవి పూర్తయిన తర్వాత `సలార్‌ 2`, `కల్కి 2` చిత్రాలు చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ కంటిన్యూగా ఒక ప్రొడక్షన్‌ హౌజ్‌తో సినిమాలు చేయబోతున్నారు. అదే హోంబలే ఫిల్మ్స్.

ఈ బ్యానర్‌లో ఇప్పటికే `సలార్‌` మూవీ చేశారు. అనంతరం `సలార్‌ 2` రానుంది. వీటితోపాటు మరో మూవీ ఉంది. ఇది కాకుండా ఈ బ్యానర్‌లో మరికొన్ని సినిమాలు చేయనున్నారట ప్రభాస్‌. తాజాగా ఆయనే ఈ విషయాన్ని తెలిపారు.

హోంబలే ఫిల్మ్స్ తో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. తాజాగా ప్రభాస్‌ `హాలీవుడ్‌ రిపోర్టర్‌`తో షార్ట్ గా ఈ విషయాలను పంచుకున్నారు.

విజయ్ కిరగందూర్ తో ప్రభాస్ బంధం

వారు తెలిపిన కథనం ప్రకారం హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్‌ కిరగందూర్‌తో కనెక్ట్ కావడానికి కారణం ఏంటో తెలిపారు ప్రభాస్‌.

విజయ్‌ కిరగందూర్‌.. టీమ్‌ని చూసుకునే తీరు బాగుంటుంది, చాలా కేర్‌ తీసుకుంటారు. అదే సమయంలో చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయనతో ఉంటే ఒక ఫ్యామిలీతో ఉన్నట్టుగా ఉంటుంది. అదే మమ్మల్ని దగ్గర చేసింది. మేం కలిసి ఇంకా చాలా ప్లాన్‌ చేస్తున్నాం` అని తెలిపారు ప్రభాస్‌.

`మా మొదటి సినిమా `సలార్‌` నుంచి నేను వారి ఇంట్లో ఉన్నట్టుగా భావిస్తున్నా. ఆయన చిన్ననాటి స్నేహితులకు దగ్గరగా ఉంటారు. ఎంత ఎదిగినా వారిని దూరం చేసుకోలేదు. నాలాగే ఎక్కువగా బయటకు వెళ్లరు. ఆ లక్షణం నాకు మరింతగా కనెక్ట్ అయ్యింది` అని అన్నారు ప్రభాస్‌.

నిర్మాతకు సంబంధించిన మరో విషయాన్ని పంచుకుంటూ `కేజీఎఫ్‌` సినిమా షూటింగ్‌ సమయంలో సెట్‌ మంటల్లో చిక్కుకుంది. బడ్జెట్‌ ఎక్కువైంది. టీమ్‌ టెన్షన్‌ పడుతున్నారు.

ప్రొడక్షన్ క్వాలిటీ ప్రాముఖ్యత

ఆ సమయంలో విజయ్‌ చెప్పిన మాట రిలాక్స్ అవ్వండి, డబ్బు గురించి కాదు, ప్రొడక్షన్‌ గురించి ఆలోచించండి. నాకు క్వాలిటీ ముఖ్యం, మనీ కాదు` అని ఆయన చెప్పిన విధానం బాగా నచ్చింది. ఆ లక్షణమే మేం కలిసి మరిన్ని ప్రాజెక్ట్ లు చేయడానికి కారణమవుతుంది` అని చెప్పారు ప్రభాస్‌.

ప్రభాస్‌ ఇలా రియాక్ట్ కావడం చాలా అరుదు. అది కూడా ఒక ప్రొడక్షన్‌ హౌజ్‌ గురించి ఇంత బాగా చెప్పడం విశేషం. ప్రభాస్‌ ప్రస్తుతం `ది రాజాసాబ్‌` మూవీతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డిసెంబర్‌ 5న ఈ చిత్రం విడుదల కానుంది. రొమాంటిక్‌ కామెడీ హర్రర్‌ ఫాంటసీగా రూపొందుతుంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రభాస్ మరియు హోంబలే ఫిల్మ్స్ మధ్య ఉన్న బలమైన బంధం మరిన్ని సినిమాలకు దారితీస్తుందని ఈ వార్త స్పష్టం చేస్తుంది. ప్రభాస్ నిర్మాతలతో ఉన్న సంబంధాలకు ఇది ఒక మంచి ఉదాహరణ.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.