
📌 Key Points
- ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ జనవరి 1న విడుదల కానుంది.
- సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల లక్ష్యం.
- ప్రభాస్ పోలీస్ అధికారిగా, ఖైదీగా ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం.
- బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి హీరోయిన్; గ్లోబల్ స్థాయిలో సినిమా విడుదల కానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఖరారైంది. జనవరి 1న ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వార్త ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది.
స్పిరిట్ పై భారీ అంచనాలు, విడుదల ప్రణాళికలు
Spirit First Look: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి డైరెక్షన్ లో అర్జున్ రెడ్డి యానిమల్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో స్పిరిట్ సినిమాపై కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం స్పిరిట్(Spirit) రెగ్యులర్ షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.
ఈ సినిమాని 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సందీప్ రెడ్డి (Sandeep Reddy)ప్రణాళికలు రచించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పిరిట్ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినపడుతున్నాయి. మరొక రెండు రోజులలో 2026 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో జనవరి 1వ తేదీని పురస్కరించుకొని ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ప్రభాస్ ఫస్ట్ లుక్: జనవరి 1న రానున్న సర్‌ప్రైజ్
ఈ విధంగా స్పిరిట్ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు రాబోతోందనే వార్త తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గాను అలాగే ఖైదీగా కూడా కనిపించబోతున్నట్టు ఇటీవల విడుదల చేసిన ఒక ఆడియో టీజర్ ద్వారా స్పష్టమైనది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కు సంబంధించి ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల ప్రభాస్ రాజా సాబ్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పిలకతో హాజరైన సంగతి తెలిసిందే.
పిలకతో దర్శనమిచ్చిన ప్రభాస్..
ప్రభాస్ పాత్ర, లుక్ పై ఉత్కంఠ, నటీనటులు
ఇలా పిలక కట్టుకొని సరికొత్త లుక్ లో కనిపించడంతో బహుశా ఇదే లుక్ లో స్పిరిట్ సినిమాలో కనిపించబోతున్నారా అంటూ అభిమానులు కూడా సందేహాలను వ్యక్తం చేశారు. ఇక ప్రభాస్ పాత్రకు సంబంధించిన పస్ట్ లుక్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరొక రెండు రోజులు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని టి సిరీస్ బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాదులోనే షూటింగ్ పనులను జరుపుకుంటుందని తెలుస్తుంది.
మొత్తంగా, ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ విడుదల తేదీ ఖరారు కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రభాస్ కొత్త లుక్, పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 1న రాబోయే ఈ అప్‌డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది.


