|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్: ‘ప్రతి అమ్మాయికి ప్రభాస్ కావాలి, కానీ దొరికేది మాత్రం…’ వైరల్!

Published: 24-07-2026, 12:07 PM

టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రభాస్ శ్రీను తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రస్థానం గురించి ఆయన పంచుకున్న ఆసక్తికర విషయాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

Key Points

1

ప్రభాస్ శ్రీను సంచలన వ్యాఖ్యలు: "ప్రతి అమ్మాయికీ ప్రభాస్ కావాలి, కానీ దొరికేది మాత్రం ప్రభాస్ శ్రీనే!"

2

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌పై అభిమానంతో తన పేరు ముందు 'ప్రభాస్' చేర్చుకున్న శ్రీను.

4

'గబ్బర్ సింగ్' సహా 150కి పైగా సినిమాల్లో నటించి, ఉత్తమ నటుడిగా సైమా అవార్డు గెలుపు.

ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, నెగిటివ్ షేడ్స్ ఉన్న హాస్య పాత్రలతో సుమారు 150కి పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు ప్రభాస్ శ్రీను . ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకునే రోజుల నుంచే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో ఉన్న సాన్నిహిత్యం, ఆయనపై ఉన్న అమితమైన అభిమానంతో తన పేరు ముందు ప్రభాస్ అని చేర్చుకున్నారు. ప్రారంభంలో ప్రభాస్ వ్యక్తిగత, సినీ వ్యవహారాలు చూసుకునే శ్రీను, ఆ తర్వాత పూర్తిస్థాయి నటుడిగా మారి ‘గబ్బర్ సింగ్’, ‘బలుపు’, ‘ఆగడు’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ఆయన పండించిన హాస్యానికిగానూ ఉత్తమ నటుడిగా సైమా అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. * సూపర్ నేచురల్ థ్రిల్‌తో ‘మంగళవారం 2’… షాకింగ్ అప్‌డేట్ ఇచ్చిన అజయ్ భూపతి ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను తన వ్యక్తిగత జీవితం, సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరంగా చెప్పుకొచ్చారు. “జీవితం అనేది మనం రాసుకున్న ప్లాన్ ప్రకారం జరగదు. ప్రతి ఒక్కరూ చదువు పూర్తి చేసి, ఉద్యోగం సంపాదించి, పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ అందరికీ అలా కుదరదు. దీనికి ఉదాహరణగా.. ‘ప్రతి అందమైన అమ్మాయికి ప్రభాస్ లాంటి భర్త కావాలని కోరుకుంటుంది, కానీ దురదృష్టవశాత్తూ ప్రభాస్ శ్రీను లాంటి వాళ్లు దొరుకుతారు’ అని ఒక సినిమాలో నా కోసమే రాసిన డైలాగ్‌ను నేను ఇప్పటికీ గుర్తుచేసుకుంటాను” అని నవ్వుతూ చెప్పారు. తాను పదో తరగతి పూర్తి చేశాక, ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష రాసి చదువుకుని మంచి ఉద్యోగంలో స్థిరపడతానని తన తండ్రి భావించారని గుర్తుచేశారు. ఒకవేళ తాను సినిమాల్లో రాణించకపోతే, చదువు సరిగ్గా రాక జీవితాన్ని నాశనం చేసుకున్నాడని ఊళ్లలో అనుకునేవారని తెలిపారు. ఇండస్ట్రీ ఎంట్రీకి ప్రేరణ గురించి మాట్లాడుతుండగా.. స్క్రీన్ పై కనిపించాలనే కోరిక అందరికీ ఉన్నప్పటికీ అది సాధించడం అందరికీ సాధ్యం కాదన్నారు. తాను చదువు పక్కనపెట్టి, వీధుల్లో గొడవలు పడుతూ తిరుగుతున్న రోజుల్లో, తన పరిస్థితి చూసి తన తండ్రి స్నేహితుడైన సీనియర్ యాక్టర్ శరత్ బాబు గారు ముఖ్యమైన సలహా ఇచ్చారని చెప్పారు. ప్రభాస్ శ్రీనుకి చదువు అబ్బడం లేదని తెలుసుకున్న ఆయన చెన్నైకి పంపి మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చమని ఆయన తండ్రికి సూచించారట. దాంతో తన జీవితం సినిమాల వైపు మలుపు తిరిగిందని, అయితే చాలామంది అనుకుంటున్నట్లు తాను మద్రాసు పార్కుల్లో పడుకుని విపరీతమైన కష్టాలు పడి పరిశ్రమలోకి రాలేదని కుండబద్దలు కొట్టారు. * రాజకీయాల్లోకి అల్లు అర్జున్?… రూమర్స్‌కి చెక్ పెట్టిన మేనేజర్ శరత్ చంద్ర నాయుడు నిజానికి అప్పట్లో తన జీవితంలో ఏ విధమైన గోల్స్ లేవని, కానీ తన తండ్రికి మాత్రం ” వీడు ఏదో ఒకటి సాధిస్తాడు” అనే ఒక పాజిటివ్ నమ్మకం ఉండేదని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. ఆ సమయంలో పెద్ద అధికారులు వచ్చి తన తండ్రితో “మీ అబ్బాయి కెరీర్ ఎందుకు పాడు చేస్తున్నారు, చదువుకోకపోతే ఎలాగ?” అని అడిగినప్పుడు రాత్రి పూట భయం వేసేదని, కానీ ఉదయం లేవగానే ఆ సీరియస్‌నెస్ మాయమయ్యేదని ప్రభాస్ శ్రీను తన గతాన్ని ఎంతో నిజాయితీగా షేర్ చేసుకున్నారు.

ప్రభాస్ పేరు వెనుక అసలు కథ ఇదే!

సినీ రంగ ప్రవేశం వెనుక శరత్ బాబు సలహా!

ప్రభాస్ శ్రీను సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన చేసిన ఈ షాకింగ్ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. మరిన్ని సినీ విశేషాలు, అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.