
📌 Key Points
- దురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో ప్రభాస్, సూర్య మల్టీస్టారర్ మూవీ – టాలీవుడ్లో సంచలనం!
- ప్రభాస్, సూర్య కాంబినేషన్ మూవీ.. పాన్ ఇండియా స్థాయిలో భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రం!
- ఈ సినిమాలో ప్రభాస్, సూర్య ఇద్దరికీ సమాన ప్రాధాన్యత.. పవర్ఫుల్ రోల్స్‌లో ఇద్దరు స్టార్ హీరోలు!
- ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్, సూర్య నటనకు ఉన్న క్రేజ్‌తో సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం!
టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ప్రభాస్ రెడీ అయ్యాడు. దురంధర్ 2 ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో సూర్యతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్‌లో నటించబోతున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
దురంధర్ డైరెక్టర్ తో ప్రభాస్ మూవీ?
Aditya Dhar : డైరెక్టర్ ఆదిత్య ధర్. ధురంధర్ 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత ఈయన పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారిపోయింది. ధురంధర్ 2 తో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల సునామీ సృష్టించిన ఈ దర్శకుడు తర్వాత ఓ పెద్ద ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నాడట.
సూర్యతో కలిసి ప్రభాస్ చేసేది మల్టీస్టారర్?
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను కలిపి ఇండియన్ సినిమాని షేక్ చేసేలా మల్టీస్టారర్‌ను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట. డైరెక్టర్ ఆదిత్యధర్ తీయబోయే ఈ సినిమాలో ప్రభాస్, సూర్య ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని టాక్. ఇది ఒక హైవోల్టేజ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతోందని, ఇద్దరు హీరోలు బిగ్ స్టార్స్ కావడంతో సినిమాలో ఈక్వల్ ప్రయారిటీ ఉండేలా పవర్‌ఫుల్ రోల్స్‌ను క్రియేట్ చేస్తున్నారని బాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పాన్ ఇండియా మూవీగా ప్లాన్?
స్టోరీ కూడా పాన్ ఇండియా రేంజ్‌లో ఉండి, ఇంటర్నేషనల్ లొకేషన్స్‌లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్, సూర్య కాంబినేషన్ నిజమైతే బాక్సాఫీస్ దగ్గర భారీ సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ పాన్ ఇండియా మార్కెట్, సూర్య నటనకు ఉన్న క్రేజ్ కలిసి సినిమాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. స్పెషల్‌గా యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామా రెండూ బ్యాలెన్స్‌గా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ గాసిప్ మాత్రం బాలీవుడ్ లో వినిపిస్తుంది. దీంతో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్‌లో సినిమాపై ఇప్పట్నుంచే హైప్‌ను పెంచుకుంటున్నారు.
ప్రస్తుతానికి ఇది ఒక గాసిప్ మాత్రమే అయినా, త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

