
ప్రభాస్ గురించి తమిళ డిస్ట్రిబ్యూటర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ‘రాధేశ్యామ్’ సినిమా నష్టాలను ఆయన భరించారని, తన సినిమా ప్రమోషన్లలో తక్కువగా పాల్గొంటారని తెలిసింది.
Key Points
తమిళ డిస్ట్రిబ్యూటర్ ప్రకారం, ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా నష్టాలకు రూ.50 కోట్లు తిరిగి ఇచ్చాడు.
ప్రభాస్ తన సినిమా ప్రమోషన్లలో తక్కువగా పాల్గొంటాడు.
'రాజాసాబ్' చిత్రం డిసెంబరు 5న విడుదల కానుంది, కానీ సంక్రాంతికి వాయిదా పడే అవకాశం ఉంది.
ప్రభాస్ 'ఫౌజీ' చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది.
తమిళ డిస్ట్రిబ్యూటర్ వెల్లడి
మిగతా హీరోలతో పోలిస్తే ప్రభాస్ పెద్దగా బయట కనిపించడు. తన సినిమాలేవో తాను చేసుకుంటూ ఉంటాడు. రిలీజ్ టైంలో, అది కూడా సమయం దొరికితేనే ప్రమోషన్లలో పాల్గొంటూ ఉంటాడు. ప్రభాస్ గురించి రూమర్స్ వస్తుంటాయి గానీ అవి నిజమో కాదో అనేది కూడా పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన విషయం మాత్రం వైరల్ అవుతోంది. ప్రభాస్.. తమకు రూ.50 కోట్ల తిరిగొచ్చాడని సదరు వ్యక్తి చెప్పుకొచ్చాడు.
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవుతూ వచ్చాయి. ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాలకు కలెక్షన్స్‌తో పాటు కొంతమేర నష్టాలు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే విషయాన్ని ఓ తమిళ డిస్ట్రిబ్యూటర్ చెప్పుకొచ్చాడు. ‘రాధేశ్యామ్’ మూవీకిగానూ ప్రభాస్.. రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాడని, కానీ సినిమా ఆడకపోయేసరికి రూ.50 కోట్లు నిర్మాతకు ఇచ్చాడని, ఈ మొత్తాన్ని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వమని కోరాడని వైరల్ అవుతున్న వీడియోలో సదరు డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు.
ప్రభాస్ సినిమా ప్రమోషన్స్
మరి ఇది ఎప్పటి వీడియోనో తెలియదు గానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రభాస్ చేసిన పనిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇప్పటి జనరేషన్‌లో చాలామంది హీరోలు.. పారితోషికం ఎక్కువగానే తీసుకుంటున్నారు గానీ ఫ్లాప్ అయిన నష్టాలొస్తే మాత్రం తిరిగి ఇచ్చేందుకు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించరు. అలాంటి వాళ్లతో పోలిస్తే ప్రభాస్ డిఫరెంట్ అని చెప్పొచ్చు.
ప్రభాస్ రాబోయే చిత్రాలు
ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ‘రాజాసాబ్’ చివరిదశ పనుల్లో ఉంది. లెక్క ప్రకారం డిసెంబరు 5న థియేటర్లలోకి రావాలి. కానీ సంక్రాంతికి వాయిదా పడొచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ‘ఫౌజీ'(వర్కింగ్ టైటిల్) షూటింగ్ సగానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇది వచ్చే వేసవికి రిలీజ్ కావొచ్చని అంటున్నారు. వీటితోపాటు సెప్టెంబరు చివర్లో సందీప్ రెడ్డి వంగా తీయబోయే ‘స్పిరిట్’ షూటింగ్‌లోనూ ప్రభాస్ పాల్గొననున్నాడు.
ప్రభాస్ వంటి నటులు ఇండస్ట్రీలో చాలా అరుదు. తన సినిమాల విజయవంతం కాకపోయినా నష్టాలను భరించడం అభినందనీయం. ఆయన రాబోయే చిత్రాలపై అభిమానులకు ఆసక్తి ఉంది.


