
📌 Key Points
- ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘మ్యాజిక్’!
- హీరోయిన్స్ గా శ్రీలీల, మీనాక్షి చౌదరి.. ఫాన్స్ కి పండగే!
- ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం!
- ప్రస్తుతం హీరోగా సినిమాలు పూర్తి చేసిన తర్వాత డైరెక్షన్ పై ఫోకస్!
తమిళ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమయ్యారు. ‘లవ్ టుడే’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రదీప్, ఇప్పుడు డైరెక్షన్ లో తన సత్తా చాటేందుకు వస్తున్నాడు.
ప్రదీప్ రంగనాథన్ మళ్ళీ డైరెక్టర్ గా!
Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్.. రీసెంట్ గా తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. కోమాలి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్.. లవ్ టుడే సినిమాతో హీరోగా మారిపోయాడు. ఆ సినిమా ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అక్కడినుంచి వెనక్కి తిరిగి చూడటం లేదు మనోడు. హీరోగా వరుస సినిమాలు చేస్తూ స్టార్స్ లిస్టులోకి చేరిపోయాడు.
ఆ తరువాత వచ్చిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, డ్యూడ్ సినిమాతో మరో రెండు బ్లాక్ బస్టర్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాయి. దీంతో, తమిళ ఇండస్ట్రీలో ప్రదీప్ రంగనాథన్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మేకర్స్ అందరూ అతనితో సినిమాలు చేసుకుందుకు క్యూ కడుతున్నారు. అయితే, తాజాగా ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) మళ్ళీ డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్నాడట.
శ్రీలీల, మీనాక్షి చౌదరితో ‘మ్యాజిక్’ మూవీ!
ఇందుకోసం ఇంతవరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో రాని సరికొత్త కాన్సెప్ట్ ను తయారు చేసుకున్నాడట. లేడీ ఓరియెంటెడ్ కథతో రానున్న ఈ సినిమాలో సౌత్ స్టార్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరిని హీరోయిన్స్ గా తీసుకున్నాడట. ఫాంటసీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాకు మ్యాజిక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన రానుందట.
2027లో విడుదల కానున్న ఈ చిత్రం!
ప్రెజెంట్ ప్రదీప్ రాంగనాథన్ హీరోగా చేస్తున్న సినిమాలు కంప్లీట్ అవగానే ఈ సినిమాను మొదలుపెట్టనున్నాడట. దీంతో, ప్రదీప్ రంగనాథన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. ఇక ప్రదీప్ రంగనాథన్ హీరోగా వస్తున్న కొత్త సినిమా Lik త్వరలోనే విడుదల కానుంది. విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


