
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయ పరిణతి లేదని ఆయన ఆరోపించారు. ఈ విమర్శలకు బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి స్పందించారు.
Key Points
ప్రకాశ్ రాజ్ పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు.
పవన్ కల్యాణ్ కు రాజకీయ పరిపక్వత లేదని ప్రకాష్ రాజ్ అభిప్రాయం.
బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
వార్తల్లో నిలవడానికే ఈ విమర్శలు అని బీజేపీ నేత వాదన.
ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) వరుస విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయ పరిపక్వత లేదని.. అదృష్టవశాత్తు డిప్యూటీ సీఎం అయ్యారని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. అంతేకాదు.. పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉండటాన్ని ముంబయి లోకల్ ట్రైన్ జర్నీతో పోల్చారు. సొంత నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడటం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందు హిందీ భాష, తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై కూడా పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి(Vishnuvardhan Reddy) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
‘‘బీజేపీ పార్టీపై నిత్యం విమర్శలు చేయడం మీ పని. నేడు పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడం వార్తల్లో నిలవడానికే తప్ప.. మరొకటి కాదు. అసలు ప్రజలకు మీరు చేసిందేమిటి.. ఏం సాధించారని పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఎంపీ పోటీ చేశారు, మీరు ఏం సాధించారు?, ఇకనైన విమర్శలు మానుకోండి. బీజేపీ, జనసేన మీకు అండగా ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఉండండి’ అని విష్ణువర్దన్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.
బీజేపీ నేత స్పందన
పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు
ప్రకాశ్ రాజ్ విమర్శలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వడంతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది. రాజకీయ వ్యూహాలపై చర్చ జరుగుతోంది.


