|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రసాదాన్ని ఎడమ చేత్తో ఎందుకు తీసుకోకూడదు? కారణాలు తెలుసుకోండి!

Published: 08-05-2025, 3:13 AM

సనాతన ధర్మంలో ప్రసాదాన్ని కుడిచేతితో తీసుకోవడం ఒక ప్రధాన సంప్రదాయం. ఈ సంప్రదాయం వెనుక ఉన్న కారణాలను, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దాని ప్రాముఖ్యతను ఈ కథనం వివరిస్తుంది.

Key Points

1

ప్రసాదాన్ని కుడి చేత్తో తీసుకోవడం శుభప్రదం.

2

కుడి చేయి సూర్యునికి, మంగళకర శక్తికి చిహ్నం.

4

శుభకార్యాలకు కుడి చేతిని ఉపయోగించడం మంచిది.

కుడి చేయి: మంగళకరమైన శక్తి

సనాతన ధర్మంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని మనం పాటిస్తూ ఉంటాము. పూర్వికులు పాటించే పద్ధతులను కూడా మనం పాటిస్తూ ఉంటాము. అలా పాటించడం వలన ఎలాంటి ఆటంకాలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు అని కూడా నమ్ముతారు. పూర్వీకుల నుంచి ఇప్పటి దాకా చాలానే పాటిస్తూ వచ్చాము. వాటిలో ఒకటి కుడి చేతితో ప్రసాదాన్ని తినడం. గుడికి వెళ్ళినా లేదంటే ఎవరైనా ఇంటికి ప్రసాదాన్ని తీసుకువచ్చినా కూడా కుడి చేతితో తింటాము.

ఎడమ చేతితో ప్రసాదాన్ని స్వీకరించము. అయితే, ఎడమ చేతితో ప్రసాదాన్ని తినకూడదా?, కుడి చేతితోనే ఎందుకు తినాలి అనే దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఎడమ చెయ్యిని అపరిశుభ్రమైనదిగా భావించాలా లేక అది మూఢనమ్మకమా అని అడుగుతుంటారు. దీని గురించి వివరంగా ఇప్పుడే చూద్దాం.

పండితులు చెబుతున్న దాని ప్రకారం కుడి చెయ్యి మంగళకరమైన శక్తి, సూర్యుడికి చిహ్నం. ఎడమ చెయ్యి దాచిన శక్తి, చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. అందుకనే ప్రసాదాన్ని తీసుకోవడంతో పాటుగా శుభకార్యాలను ఏమైనా జరపడానికి కుడి చెయ్యిని ఉపయోగిస్తాము. భగవంతుడికి హారతి ఇచ్చినా, నైవేద్యాన్ని పెట్టినా, ఎవరికైనా ఏమైనా దానం చేసినా కుడి చెయ్యిని ఉపయోగిస్తాము. ఇలా చేయడం వలన భగవంతుని ఆశీస్సులు కలిగి సంతోషంగా ఉండవచ్చు. అలాగే నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.

ఎడమ చేయి: దాచిన శక్తి

ఎడమ చెయ్యి దురదృష్టాన్ని తీసుకు వస్తుందా?

జ్యోతీషుల అభిప్రాయం ప్రకారం కొన్ని పనులకే ఎడమ చెయ్యిని ఉపయోగిస్తాము. అవి అపవిత్రమైనవిగా పరిగణించబడతాయి. అందుకనే ఎడమ చేతితో ఏదైనా మతపరమైన పనులు చేయడం అశుభం అని అంటారు.

ప్రసాదాన్ని ఎలా స్వీకరించాలి?

ప్రసాద స్వీకరణ విధానం

పండితులు చెప్తున్న దాని ప్రకారం ప్రసాదాన్ని కుడి చేతితో తీసుకోవాలి. చేతులు కడుక్కుని శుభ్రమైన చేతులతో స్వీకరించాలి. ఎడమ చేయి పై కుడి చేయి పెట్టి ప్రసాదాన్ని స్వీకరించి, ఆ తర్వాత ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని తినాలి. ఇలా చేయడం వలన సంతృప్తి కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

ప్రసాద స్వీకరణలో కుడిచేతిని ఉపయోగించడం శుభప్రదం. కుడిచేతి మంగళకరతను, శుభాన్ని సూచిస్తుంది. శుభ్రతతో కూడిన ప్రసాద స్వీకరణ మనసుకు సంతృప్తిని ఇస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.