|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రేమించిన వ్యక్తితో పెళ్ళి జరగాలా? అయితే కృష్ణాష్టమి వేళ ఇలా చేసి చూడండి, సమస్యలన్నీ తీరిపోవచ్చు!

Published: 16-08-2025, 1:15 AM
ప్రేమించిన వ్యక్తితో పెళ్ళి జరగాలా? అయితే కృష్ణాష్టమి వేళ ఇలా చేసి చూడండి, సమస్యలన్నీ తీరిపోవచ్చు!

శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగాలని కోరుకునే వారికి కొన్ని ప్రత్యేక పరిహారాలు ఉన్నాయి. కృష్ణుని అనుగ్రహం పొందడానికి ఈ పరిహారాలను అనుసరించండి.

Key Points

1

కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని ప్రార్థించి కోరిక నెరవేర్చుకోండి.

2

రాధాకృష్ణులను పూజించి, అరటి చెట్టుకు పసుపు నీళ్ళు సమర్పించండి.

4

ప్రేమలో కోపం తగ్గించుకోవడానికి నెమలి పింఛం, గులాబీలు సమర్పించండి.

కృష్ణాష్టమి నాడు చేయాల్సిన పూజలు

భారతదేశమంతా శ్రీకృష్ణ జన్మాష్టమిని అంగారంగ వైభవంగా జరుపుకుంటారు. శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 16 అంటే ఈరోజు వచ్చింది. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు కృష్ణుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. కృష్ణుని అనుగ్రహం కలగాలని ఉపవాసం కూడా ఉంటారు. కృష్ణాష్టమి నాడు కొంతమంది కృష్ణుడి విగ్రహాన్ని కొనుగోలు చేస్తారు. ఆవు దూడతో కలిసి ఉన్న కృష్ణుని విగ్రహాన్ని కృష్ణాష్టమి నాడు ఇంటికి తీసుకురావడం వలన మంచి జరుగుతుంది. వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.

అష్టధాతువులతో చేసిన కృష్ణుడి విగ్రహాన్ని కృష్ణాష్టమి నాడు ఇంట్లో పెట్టడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. అదే విధంగా, కృష్ణాష్టమి నాడు వైజయంతి మాలను కూడా ఇంటికి తీసుకురావడం శుభప్రదం. దీనిని తీసుకురావడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు.

దక్షిణావర్తి శంఖం కూడా శుభ ఫలితాలను తీసుకువస్తుంది. కృష్ణాష్టమి నాడు దీనిని ఇంటికి తీసుకువచ్చి నీళ్లు, పాలు పోసి కృష్ణుడికి అభిషేకం చేస్తే వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. దాంతో పాటుగా, కృష్ణాష్టమి నాడు ఈ పరిహారాలని పాటించడం మంచిది. ఈ పరిహారాలని పాటించడం వలన వైవాహిక జీవితం మధురంగా మారుతుంది. ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది.

ప్రేమ వివాహానికి ప్రత్యేక పరిహారాలు

కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరగాలంటే కృష్ణాష్టమి నాడు కృష్ణుడి ఆలయాన్ని సందర్శించండి. కృష్ణుడికి ఒక వేణువుని సమర్పించండి. అదేవిధంగా “ఓం క్లీం కృష్ణాయ నమః” అనే మంత్రాన్ని పఠించండి. దీంతో కోరుకున్న వ్యక్తి జీవితంలోకి వస్తారు, సంతోషంగా ఉండొచ్చు.

కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరగాలనుకుంటే, కృష్ణాష్టమి నాడు రాధాకృష్ణులని పూజించండి. అరటి చెట్టుకు పసుపు నీళ్లను సమర్పించండి. “ఓం గ్రీం గ్రౌం సహ గురవే నమః” అనే మంత్రాన్ని మనస్ఫూర్తిగా పఠించండి. ఇలా చేయడం వలన త్వరగా పెళ్లి జరిగే అవకాశం ఉంది.

కోపం తగ్గి ప్రేమ పెరగాలంటే

వైవాహిక సమస్యలకు పరిష్కారాలు

మీరు కోరుకునే వ్యక్తి మీతో కోపంగా ఉంటే, కోపాన్ని తగ్గించడానికి కృష్ణాష్టమి నాడు కృష్ణుడి ఆలయానికి వెళ్లి నెమలి పింఛం సమర్పించండి. ఐదు ఎర్రటి గులాబీలను కృష్ణుని పాదాల వద్ద పెట్టండి. ఇలా చేయడం వలన రాధాకృష్ణుల అనుగ్రహం కలిగి పెళ్లి జరుగుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

కృష్ణాష్టమి పరిహారాలను అనుసరించడం వల్ల మీ కోరికలు నెరవేరవచ్చు. అయితే, ఇవి సూచనలు మాత్రమే. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.