|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నన్ను విమర్శించినప్పుడు కూడా నేను వాటిని గౌరవంగా స్వీకరిస్తాను: పృథ్వీరాజ్ సుకుమారన్

Published: 15-11-2025, 4:26 AM
నన్ను విమర్శించినప్పుడు కూడా నేను వాటిని గౌరవంగా స్వీకరిస్తాను: పృథ్వీరాజ్ సుకుమారన్

మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తన కొత్త చిత్రం ‘విలాయత్ బుద్ధా’ ప్రమోషన్స్‌లో విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులే తన బలం అని, వారి విమర్శలను గౌరవంగా స్వీకరిస్తానని తెలిపారు. అంతేకాకుండా, ఆయన రాజమౌళి-మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘SSMB-29’లోనూ భాగం అవుతున్నట్లు వెల్లడైంది.

Key Points

1

పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న 'విలాయత్ బుద్ధా' ట్రైలర్ విడుదలైంది; నవంబర్ 21న సినిమా రిలీజ్.

2

ప్రేక్షకుల ప్రశంసల తోపాటు విమర్శలను కూడా గౌరవంగా స్వీకరిస్తానని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.

4

SSMB-29లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.

విమర్శలను గౌరవంగా స్వీకరిస్తాను: పృథ్వీరాజ్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విలాయత్ బుద్ధా’(Vilayath Buddha). జయన్ నంబియార్(Jayan Nambiar) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ప్రియంవద కృష్ణన్ హీరోయిన్‌గా కనిపించనుంది, షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్ 21న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, ‘విలాయత్ బుద్ధా’ మూవీ మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న పృథ్వీరాజ్ సుకుమారణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నేను ఈ స్థాయిలో ఉండటానికి ప్రేక్షకులే కారణం.

‘విలాయత్ బుద్ధా’ ప్రమోషన్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు

వాళ్ల ప్రేమాభిమానాలే నన్ను ఇక్కడ నిలబెట్టాయని నమ్ముతున్నాను. అలాంటప్పుడు వాళ్లకు ప్రశంసించే హక్కుతో పాటు విమర్శించే అధికారాలున్నాయి. నాపై అభిమానంతోనే నా సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్‌కి వస్తున్నారు. మళయాళ ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదరించారు. అలాగే నా సినిమాల్లో తప్పులు చూపినప్పుడు, నన్ను విమర్శించినప్పుడు కూడా నేను వాటిని గౌరవంతో స్వీకరిస్తాను తప్ప బాధపడను. ఆడియన్స్‌ను అలరించడానికి వందశాతం ప్రయత్నించడానికే నా ఆరాటం’’ అని చెప్పుకొచ్చారు.

SSMB-29లో కుంభ పాత్ర: రాజమౌళి ప్రకటన

ఇక ఈ మూవీతో పాటు పృథ్వీరాజ్ సుకుమారణ్ తెలుగులో ఓ భారీ ప్రాజెక్ట్‌లోనూ కనిపించబోతున్నారు. రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ‘SSMB-29’లో కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. ఇక ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా.. నేడు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈరోజు జరగబోతుంది. ఇక ఇందులో మూవీ టీమ్ అంతా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

‘విలాయత్ బుద్ధా’తో అలరించడానికి సిద్ధమవుతున్న పృథ్వీరాజ్, తన వినయాన్ని ప్రదర్శిస్తూనే, ‘SSMB-29’ వంటి భారీ చిత్రంతో పాన్-ఇండియా ప్రేక్షకులకు మరింత చేరువకానున్నారు. ఆయన కెరీర్లో ఇది కీలక ఘట్టం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.