|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Prithviraj Sukumaran: డైరెక్ట్‌గా ఓటీటీకి సలార్ హీరో సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published: 30-06-2025, 6:51 AM

సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన పృథ్వీరాజ్ సుకుమారన్, తన తాజా చిత్రం ‘సర్‌జమీన్’ను ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం జూలై 25న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Key Points

1

సలార్‌తో పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ తాజా చిత్రం 'సర్‌జమీన్'.

2

ఓటీటీలో నేరుగా విడుదల అవుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ జూలై 25న స్ట్రీమింగ్‌లోకి రానుంది.

3

జియో హాట్‌స్టార్‌లో 'సర్‌జమీన్' చూడొచ్చు.

4

కాజోల్, ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి పృథ్వీరాజ్ నటించిన ఈ చిత్రం కశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కింది.

సర్‌జమీన్: ఓటీటీ రిలీజ్ డేట్

సలార్ మూవీతో టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో ఫేమ్ తెచ్చుకున్న హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆ తర్వాత ఆడుజీవితం సినిమాతో మరోసారి సినీ ప్రియులను ‍అలరించాడు.  ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు తానే స్వయంగా దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం మరో యాక్షన్ థ్రిల్లర్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  కాయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తోన్న సర్‌జమీన్‌ అనే  బాలీవుడ్‌లో చిత్రంలో కనిపించనున్నారు. ఈ మూవీలో కాజోల్ హీరోయిన్‌గా కనిపించనుంది. దేశభక్తి నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీ సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం ‍అలీ ఖాన్‌ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నారు.  తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ తాజా చిత్రం

సర్‌జమీన్‌ మూవీని జూలై 25 నుంచి జియో హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన పేరుతో ఓ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఇబ్రహీం ‍అలీ ఖాన్‌ ఉగ్రవాదిగా కనిపంచనున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్తారు. ఈ సినిమాతోనే కాయోజ్ ఇరానీ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు.

కశ్మీర్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్

కశ్మీర్ నేపథ్యంతో ఈ మూవీని తెరకెక్కించారు. తన విధి పట్ల ఎంతో నిబద్ధత చూపించే విజయ్ మీనన్ (పృథ్వీరాజ్) చుట్టూ తిరుగుతుంది. ఇక ఈ సినిమాలో మీరా పాత్రలో కాజోల్, హర్మన్ పాత్రలో ఇబ్రహీం అలీ ఖాన్ నటించారు. మాతృభూమిని కాపాడటం కంటే ముఖ్యమైనది మరొకటి లేదు అనే క్యాప్షన్‌తో జియోహాట్‌స్టార్  ఈ వీడియోను షేర్ చేసింది.

చివరగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘సర్‌జమీన్’ సినిమా జూలై 25న జియో హాట్‌స్టార్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసింది. ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.