
ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం నటించిన ‘మిత్రమండలి’ చిత్రం అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రియదర్శి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా హిట్ కాకపోతే తన తర్వాతి సినిమా చూడొద్దని ఆయన అన్నారు. నాని సలహాతో ఈ స్టేట్‌మెంట్ ఇచ్చానని చెప్పడంతో ఇది వైరల్ అయ్యింది.
Key Points
ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం కలిసి నటించిన చిత్రం ‘మిత్రమండలి’.
విజయేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది.
సినిమా హిట్ అవ్వకపోతే తన తర్వాతి చిత్రం చూడొద్దని ప్రియదర్శి సంచలన ప్రకటన చేశారు.
నాని అన్న చెప్పిన మాటలు కాపీ కొడుతున్నానని ప్రియదర్శి చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
‘మిత్రమండలి’ చిత్రం గురించి
టాలీవుడ్ క్రేజీ హీరో ప్రియదర్శి(Priyadarshi), నిహారిక ఎన్ ఎం(Niharika NM) కలిసి నటించిన సినిమా ‘మిత్రమండలి’. ఈ మూవీతోనే ఆమె హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. విజయేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు సమర్పణలో కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప్, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ చిత్రంలో రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న ప్రియదర్శి సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ‘‘మిత్రమండలి చాలా బాగా వచ్చింది. నిజంగా బాగుంది నేను చూశాను నాకు నచ్చింది.
మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే.. సినిమా హిట్ అవ్వకపోతే.. నా నెక్స్ట్ చిత్రాన్ని మీరు చూడకండి. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా.. అవును నాకు ఒక అన్న నేర్పించాడు. నాని అన్న నేర్పాడు.. సినిమాను ఎలా ప్రేమించాలో చెప్పాడు. గొప్ప స్క్రిప్ట్ తీసుకున్నప్పుడు ఎలా నటించాలో నేర్పాడు. ఆ అన్న చెప్పిన మాటలు నేను కాపీ కొడుతున్నా.. ‘మిత్రమండలి’ నచ్చకపోతే.. నా తదుపరి చిత్రం చూడకండి ఇది నా ప్రామిస్. దీపావళిని మేము తొందరగా తీసుకువస్తాం. అందరూ కూర్చొని హ్యాపీగా నవ్వుకోండి. సంతోషంగా మీ ఫ్యామిలీతో గడపండి’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇలా మాటలు చెప్పడం అందరికీ అలవాటు అయిందని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ప్రియదర్శి సంచలన ప్రకటన
నాని నేర్పిన పాఠం & నెటిజన్ల స్పందన
ప్రియదర్శి తన చిత్రంపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఆయన మాటలకు నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. సినిమా ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.



Zareen Khan Blasts Photographer Over Inappropriate Remark, Video Goes Viral