|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రజినీకాంత్ సినిమాలో ప్రియాంక మోహన్? షాకింగ్ న్యూస్ వైరల్! నిజమెంతో తెలుసా?

Published: 27-02-2026, 7:35 AM
రజినీకాంత్ సినిమాలో ప్రియాంక మోహన్? షాకింగ్ న్యూస్ వైరల్! నిజమెంతో తెలుసా?
  • రజినీకాంత్‌తో సిబి చక్రవర్తి సినిమా..ప్రియాంక మోహన్ నటిస్తుందా?
  • సోషల్ మీడియా రూమర్స్‌పై ప్రియాంక షాకింగ్ కామెంట్స్ వైరల్!
  • నెగిటివ్ వార్తలను పట్టించుకోను..ప్రియాంక స్ట్రాంగ్ రిప్లై.
  • సిబి దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా – ప్రియాంక

టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. రజినీకాంత్ సినిమాలో ఆమె నటిస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

రజినీకాంత్ సినిమాపై ప్రియాంక క్లారిటీ!

సూపర్ స్టార్ రజినీకాంత్, డైరెక్టర్ సిబి చక్కవర్తి కాంబినేషన్‌లో ‘THALAIVAAR173’ని రీసెంట్‌గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో దర్శకుడు బాసిల్ జోసెఫ్ అండ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు నెట్టింట వార్తలు వస్తున్న క్రమంలో.. వీటిపై క్లారిటీ ఇచ్చింది ప్రియాంక. సిబి చక్రవర్తి డైరెక్షన్‌లో వచ్చిన ‘డాన్’ మీకు పెద్ద హిట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన చేస్తున్న రజనీకాంత్ సినిమాలో మీరు నటిస్తున్నారా అనే ప్రశ్నపై ప్రియాంక మోహన్ స్పందిస్తూ.. ‘రజనీ సర్ సినిమా కథ ఏమిటో నాకు తెలియదు. నేను అందులో భాగం అవుతానో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. అయితే.. ‘డాన్’ పెద్ద హిట్. ఆ తర్వాత సిబి నెక్ట్స్ ఏ మ్యాజిక్ చేయబోతున్నాడా అని ‘డాన్’ టీం ఆసక్తిగా ఎదురుచూసింది.

సిబి సర్ ఇప్పుడు రజనీ సర్‌తో సినిమా చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన రజనీ సర్‌కి పెద్ద ఫ్యాన్’ అని తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఇన్‌స్టాగ్రామ్, X అండ్ ఇతర అన్ని ప్లాట్‌ఫామ్‌లలో యాక్టీవ్‌గా ఉంటాను. అలాగే నా టీమ్ అంతా చూసుకుంటుంది. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ వార్తలను నేను పట్టించుకోను. ఎందుకంటే ప్రతి వారం ఏదో ఒక కొత్త పుకారు వస్తూనే ఉంటుంది. కొంతకాలం తర్వాత ప్రజలు వేరే కొత్త పుకారు కోసం సిద్ధం అవుతారు. అందుకే వాళ్లు సృష్టించే నెగిటివ్ వార్తలు నేను పట్టించుకోను’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.

సోషల్ మీడియా రూమర్స్‌పై సీరియస్ కామెంట్స్!

నెగిటివ్ వార్తలకు ప్రియాంక చెక్!

ప్రియాంక మోహన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.