|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రాకా ఊచకోత: బన్నీ డ్యూయల్ రోల్ ట్రీట్! రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్, అట్లీ మార్క్ బ్లాక్ బస్టర్!

Published: 09-04-2026, 4:05 AM
రాకా ఊచకోత: బన్నీ డ్యూయల్ రోల్ ట్రీట్! రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్, అట్లీ మార్క్ బ్లాక్ బస్టర్!
  • అల్లు అర్జున్ ‘రాకా’ మూవీలో సగం మనిషి, సగం జంతువుగా కనిపించనున్నాడు – ఫస్ట్ లుక్ రిలీజ్!
  • దీపికా పదుకొనె వారియర్ క్వీన్ పాత్రలో అదరగొట్టనుందట – భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్!
  • శివగామి రమ్యకృష్ణ ‘రాకా’లో పవర్ఫుల్ రోల్ – బౌండరీలు బ్రేక్ చేసే సినిమా అని కామెంట్!
  • బన్నీ డ్యూయల్ రోల్! ఒక పాత్రలో హీరో, మరో పాత్రలో విలన్ – విలన్ లుక్ అదిరిందంటున్న ఫ్యాన్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా’ చిత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్. బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయి రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

రాకాలో రమ్యకృష్ణ సర్‌ప్రైజ్ ఎంట్రీ!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం `రాకా` చిత్రంలో నటిస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఈ మూవీ టైటిల్‌ని ప్రకటిస్తూ, ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ముందు గుండు, వెనకాల కొద్దిగా హెయిర్‌తో ముఖానికి చేతులతో అడ్డుపెట్టుకున్న అల్లు అర్జున్‌ ఫస్ట్ లుక్‌ అదిరిపోయింది. ఇందులో సగం మనిషి, సగం జంతువులా(తోడేలులా) అల్లు అర్జున్‌ కనిపించబోతున్నట్టు ఈ పోస్టర్‌ని బట్టి అర్థమవుతుంది. కేవలం ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచారు దర్శకుడు అట్లీ. గతంలో ఎప్పుడూ అల్లు అర్జున్‌ని ఇలా చూడలేదు. దీంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.

`రాకా` సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమెది వారియర్‌ క్వీన్‌ తరహా పాత్ర అని తెలుస్తోంది. ఆమె పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. సన్‌ పిక్చర్స్ దాదాపు రూ.800-1000కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ మూవీకి సంబంధించి మరో సర్ప్రైజ్‌ రివీల్‌ అయ్యింది. ఇందులో శివగామి రమ్యకృష్ణ నటించబోతుందట. అల్లు అర్జున్‌ ఫస్ట్ లుక్‌ సందర్భంగా ఆమె కూడా స్పందించింది. తన సోషల్‌ మీడియాలో ఈ లుక్‌ని విడుదల చేసింది. ఈ సందర్బంగా ఆమె స్పందిస్తూ, `పరిధిలకు అతీతమైన ఒక దృశ్యం కోసం సిద్ధంకండి` అని రమ్యకృష్ణ తెలిపింది. అంటే బౌండరీలను బ్రేక్‌ చేసే సినిమా కోసం రెడీ అవ్వండి అని ఆమె పేర్కొంది. ఇది ఆమె ఇందులో నటించబోతుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ఇందులో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఆమెది `బాహుబలి`లో శివగామి తరహాలో ఒక పవర్‌ఫుల్‌ రోల్‌ అని తెలుస్తోంది. కొంత పాజిటివ్‌, మరికొంత నెగటివ్‌ షేడ్‌ మేళవింపుగా ఉంటుందని, గతంలో ఎప్పుడూ ఇలా ఆమెని చూసి ఉండరని తెలుస్తోంది.

బన్నీ డ్యూయల్ రోల్.. విలన్ గా అదరగొట్టే లుక్!

ఇక `రాకా` మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం లీక్‌ అయ్యింది. ఇప్పుడు విడుదలైన అల్లు అర్జున్‌ లుక్‌ విలన్‌ రోల్‌ ది అని టాక్‌. మరో అల్లు అర్జున్‌ రాబోతున్నారట. అదేంటంటే, ఇందులో బన్నీ రెండు పాత్రలు పోషిస్తున్నారు. ఓ పాత్రలో హీరోగా, మరో పాత్రలో విలన్‌గా కనిపిస్తాడట. ఇప్పుడు విడుదల చేసింది విలన్‌ పాత్రకి సంబంధించిన లుక్‌ అని సమాచారం. ఇక అసలు పోస్టర్‌ రానుందట. హీరోగా బన్నీ లుక్‌ రానుందని, అది మరో స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. అయితే సినిమాలో హీరో కంటే విలన్‌ లుక్కే అత్యంత భయంకరంగా ఉంటుందని, ఆ లుక్‌కి సంబంధించిన పూర్తి పోస్టర్‌ గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటుందని సమాచారం. మరో అకేషన్‌ సందర్భంగా ఈ మూవీలోని అల్లు అర్జున్‌ హీరో లుక్‌ పాత్రని విడుదల చేయనున్నట్టు టాక్‌. ఇందులో దాదాపు ఐదుగురు హీరోయిన్లు కనిపిస్తారని తెలుస్తోంది. సమంత, రష్మిక మందన్నా వంటి వారి పేర్లుకూడా వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఎలాంటి స్పష్టత లేదు.

అట్లీ మార్క్ యాక్షన్ డోస్ రెడీ!

`రాక` మూవీ గురించి చూస్తే, ఇది పునర్జన్మల కథ అని సమాచారం. రాకా అంటే రాక్షసుడు, రాకాసి, పూర్ణచంద్రుడు అనే అర్థాలున్నాయి. అయితే ముందుగా చెప్పుకున్నట్టు, రాక్షసుడు అనే అర్థంలోనే ఈ టైటిల్‌ని పెట్టినట్టు సమాచారం. హీరోలోని నెగటివ్‌ షేడ్‌ని చూపిస్తుందని, ఆయన విధ్వంసకర శక్తి, చీకటిపై వెలుగు సాధించే విజయాన్ని సూచించేలా ఊరమాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగుతుందని, సైన్స్ ఫిక్షన్‌, సూపర్‌ హీరో ఎలిమెంట్లు కూడా ఉంటాయని సమాచారం. మొత్తంగా ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పెంచేశాడు అల్లు అర్జున్‌. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘రాకా’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ డ్యూయల్ రోల్‌లో ఎలా మెప్పిస్తాడో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.