|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చాలా ఉత్తేజకరమైన దాని కోసం డబ్ చేశాను.. రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్

Updated: 10-12-2025, 12:55 AM
చాలా ఉత్తేజకరమైన దాని కోసం డబ్ చేశాను.. రాశీ ఖన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
  • రాశీ ఖన్నా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.
  • కొత్త ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెబుతున్న పిక్ షేర్ చేసింది.
  • ఆ ప్రాజెక్ట్ చాలా ఉత్తేజకరమైనదని, అయితే కష్టమైన రోజు అని క్యాప్షన్ ఇచ్చింది.
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసమేనని ఫ్యాన్స్ ఊహాగానాలు చేస్తున్నారు.

యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా ప్రస్తుతం సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలిచింది. ఆమె ఒక కొత్త, ఉత్తేజకరమైన ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెబుతున్నట్లు ప్రకటించింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవ్వగా, ఇది పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసమేనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

రాశీ ఖన్నా ఆసక్తికర పోస్ట్ వైరల్

యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇటీవల ఈ చిన్నది స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(telusu Kada) మూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Usthad Bhagat Singh) మూవీలో నటిస్తోంది.

ఉత్తేజకరమైన ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్

దీనికి హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.ఇదిలా ఉంటే.. నిత్యం సోషళ్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో తాజాగా రాశీ పోస్ట్ చేసిన పోస్ట్ చేసిన స్టోరీ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ కోసమేనా ఫ్యాన్స్ ఆరా?

షేర్ చేసిన స్టోరీలో రాశీ సీరియస్‌గా ఏదో మూవీకు డబ్బింగ్ చేప్తుంది. ఇక డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న పిక్‌ను షేర్ చేస్తూ.. ‘చాలా ఉత్తేజకరమైన దాని కోసం డబ్ చేసాను – త్వరలో వస్తుంది.. అయితే ఇది చాలా కష్టమైన రోజు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీన్ని చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకే డబ్బింగ్ చెబుతుందని కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి రాశీ ఖన్నా డబ్బింగ్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ కొత్త ప్రాజెక్ట్ ఏంటి, పవన్ కళ్యాణ్ సినిమాకేనా అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ఆమె అభిమానులు ఈ ఆసక్తికర ప్రకటనపై ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.