
📌 Key Points
- సినిమాల్లో ఆకర్షణకు ఛాతీ, పిరుదులకు ప్యాడ్లు పెట్టమని అడిగేవారని రాధికా ఆప్టే వెల్లడి.
- నాలుగు కిలోల బరువు పెరిగినందుకు తనను ఒక సినిమా నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం.
- షూటింగ్ సెట్స్‌లో తన శరీరాకృతి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారని వెల్లడి.
- గతంలోనూ సౌత్ సినిమాల్లో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్న రాధికా ఆప్టే.
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే సౌత్ సినిమాలపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను, బాడీ షేమింగ్, ప్యాడ్స్ గురించి ఆమె బహిరంగంగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చకు దారి తీశాయి.
ఛాతీ, పిరుదులకు ప్యాడ్లు: రాధికా ఆప్టే ఆవేదన
సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా తయారయ్యింది స్టార్ హీరోయిన్ రాధికా అప్టే . తన కామెంట్స్ తో ఎప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఆమె సౌత్ సినిమాలపై చేసిన కామెంట్స్ హిట్ పుట్టిస్తున్నాయి. దక్షిణాది సినిమాల్లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించింది రాధిక.
సినిమాలో ఆకర్షణీయంగా కనిపించడం కోసం తన ఛాతీ, పిరుదుల భాగంలో ప్యాడ్లు పెట్టమని అసిస్టెంట్ డైరెక్టర్లు చెప్పేవారని, అది చాలా అసౌకర్యంగా ఉండేదని రాధికా ఆప్టే వెల్లడించారు.ప్యాడింగ్ పెట్టమని అడిగినప్పుడు చాలా కోపం వచ్చేదని, ‘మీ ఇంట్లో అమ్మ, చెల్లెళ్లకు కూడా ఇలాగే ఎక్కువ ప్యాడ్లు పెట్టమని చెబుతారా?’ అని అడగాలనిపించేదని రాధికా ఆప్టే అన్నారు.
బరువు పెరిగినందుకు సినిమా నుంచి తొలగింపు
ఒక ట్రిప్ తర్వాత కేవలం నాలుగు కిలోల బరువు పెరిగినందుకు, ‘లావుగా ఉన్నారు’ అని చెప్పి తనను ఒక సినిమా నుండి తొలగించారని రాధికా ఆప్టే తన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తనను దృష్టిలో పెట్టుకుని రాసిన కథలోనే, బరువు పెరిగాననే కారణంతో తనను తిరస్కరించారని, ఆ తర్వాత ఆ సినిమా పెద్ద హిట్ అయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బాలీవుడ్ నటి రాధికా ఆప్టే, ‘కబాలి’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన కొన్ని ఇబ్బందికరమైన సంఘటనల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఒక్కప్పుడు ఆర్ధిక పరిస్థితి బాగోలేక సౌత్ సినిమాల్లో నటించానని. కానీ ఇక్కడి తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయన్నారు. సౌత్ సినిమాల గురించి రాధికా మాట్లాడటం ఇది మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు.
గతంలోనూ సౌత్ సినిమాలపై ఘాటు వ్యాఖ్యలు
20 ఏళ్ళ క్రితం ఆర్థిక ఇబ్బందుల వల్ల కొన్ని సౌత్ సినిమాల్లో నటించాల్సి వచ్చిందని, అప్పుడు షూటింగ్ సెట్స్‌పై ఉన్న పరిస్థితులు అత్యంత దారుణంగా ఉండేవని రాధికపేర్కొన్నారు. ఒక చిన్న ఊరిలో జరిగిన షూటింగ్ సమయంలో సెట్ అంతా మగవారే ఉండేవారని, అక్కడ తన శరీరాకృతి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారని రాధిక వెల్లడించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నారు. రకరకాలుగా నెటిజన్లు స్పందిస్తున్నారు.
రాధికా ఆప్టే వ్యాఖ్యలు సౌత్ సినీ పరిశ్రమలో నటీమణుల పట్ల వ్యవహరించే తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ వివాదంపై మరిన్ని స్పందనలు వెలువడే అవకాశం ఉంది. నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.
