
📌 Key Points
- వాడని డేటా అర్ధరాత్రికి రద్దు కావడంపై రాఘవ్ చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు.
- డేటా రోల్‌ఓవర్ సౌకర్యం కల్పించాలని టెలికాం సంస్థలను ఆయన డిమాండ్ చేశారు.
- డేటా వినియోగదారుల ఆస్తి అని, కంపెనీలకు ఫోర్ఫీట్ చేసే హక్కు లేదని చద్దా స్పష్టం చేశారు.
- ట్రాయ్ జోక్యం చేసుకుని వినియోగదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్ సమావేశాల్లో టెలికాం కంపెనీల దోపిడీపై గళం విప్పారు. మనం కొనుగోలు చేసిన డేటా వృథా కావడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
డేటా వృథాపై రాఘవ్ చద్దా ప్రశ్నలు
గత కొద్ది రోజులుగా పార్లమెంట్ సమావేశాల్లో ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (MP Raghav Chadha) లేవనెత్తుతున్న సమస్యలను దేశవ్యాప్తంగా అందరిని ఆలోచింపజేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సభలో ఎమ్ మాట్లాడతారని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన టెలికాం కంపెనీల దోపిడీపై ఎక్స్ వేదికగా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “మనం డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన మొబైల్ డేటా, వాడకపోతే అర్ధరాత్రికి ఎందుకు రద్దవుతుందంటూ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా (ఎంపీ రాఘవ్ చద్దా) టెలికాం కంపెనీల విధానాలను నిలదీశారు.
డేటా రోల్‌ఓవర్ డిమాండ్
టెలికాం సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న 1.5GB, 2GB డైలీ ప్లాన్లలో, వినియోగదారులు ఒకవేళ ఆ రోజు డేటాను పూర్తిగా వాడకపోతే, మిగిలిన డేటా మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ కాకుండా ‘ఎక్స్‌పైర్’ అవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “మనం 2GB కి డబ్బులు కడతాం.. కానీ 1.5GB మాత్రమే వాడితే, మిగిలిన 0.5GB అర్ధరాత్రికి మాయమైపోతుంది. ఇది పొరపాటున జరుగుతున్నది కాదు. కంపెనీలు కావాలనే చేస్తున్న పాలసీ” అని ఆయన ట్విట్టర్ (X) వేదికగా మండిపడ్డారు.
వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పిలుపు
వినియోగదారులు ఇప్పటికే చెల్లించిన డేటాను వారు ఎప్పుడైనా వాడుకునేలా ‘డేటా రోల్‌ఓవర్’ (Data Rollover) సౌకర్యాన్ని కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. డేటా అనేది వినియోగదారుల ఆస్తి అని, దానిని ఫోర్ఫీట్ (Forfeited) చేసే హక్కు కంపెనీలకు లేదని ఆయన స్పష్టం చేశారు. మనం పెట్రోల్ కొట్టించుకుంటే అది వాడనంత కాలం ట్యాంకులోనే ఎలా ఉంటుందో, డేటా కూడా అలాగే ఉండాలని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (TRAI) ఈ విషయంలో జోక్యం చేసుకుని, వినియోగదారులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. రాఘవ్ చద్దా లేవనెత్తిన ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో సాధారణ వినియోగదారుల నుండి భారీ మద్దతు పొందుతోంది.
రాఘవ్ చద్దా లేవనెత్తిన ఈ అంశం సోషల్ మీడియాలో విస్తృత మద్దతును పొందుతోంది. టెలికాం సంస్థల దోపిడీ విధానాలపై ఆయన చేస్తున్న పోరాటం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.


