
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ మరియు అలియా భట్ దంపతులకు 2022 లో జన్మించిన రాహా కపూర్ ఇప్పుడు 250 కోట్ల ఆస్తికి వారసురాలు అయింది. రణబీర్ కు వారసత్వంగా వచ్చిన బాంద్రాలోని ఖరీదైన ఇంటిని వారు రాహా పేరు మీద రిజిస్టర్ చేశారు.
Key Points
రణబీర్ కపూర్ కు వారసత్వంగా వచ్చిన 250 కోట్ల విలువైన బాంద్రా ఇల్లు.
రాహా కపూర్ పేరు మీద ఆ ఇంటిని రిజిస్టర్ చేయించిన రణబీర్ – అలియా జంట.
రెండేళ్ల రాహా 250 కోట్ల ఆస్తికి వారసురాలు అయ్యింది.
త్వరలో తమ కుటుంబంతో కలిసి ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యే అవకాశం.
250 కోట్ల విలువైన బాంద్రా ఇల్లు
Raha Kapoor : బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్ – అలియా భట్ లకు 2022 నవంబర్ లో రాహా కపూర్ జన్మించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు రణబీర్ అలియా బయటకు తీసుకురావడంతో మీడియా కంట పడి రాహా అలరిస్తుంది. తాజాగా రాహా కపూర్ పేరు వార్తల్లో నిలుస్తుంది. ఈ రెండేళ్ల బుజ్జి పాపాయి ఇప్పుడు 250 కోట్ల ఆస్తిపరురాలు.
ముంబైలోని బాగా ఖరీదైన ఏరియా బాంద్రాలో రణబీర్ కపూర్ కి వారసత్వంగా ఓ ఖరీదైన ఇల్లు వచ్చింది. రాజ్ కపూర్ నుంచి రిషి కపూర్ ఆ తర్వాత రణబీర్ కపూర్ కి ఆ ఇల్లు వారసత్వంగా సంక్రమించింది. గత సంవత్సరం రణబీర్ కపూర్ చేతికి ఆ ఇల్లు రాగా ఆ ఇంటిని రీ మోడలింగ్ చేయించాడు. 6 అంతస్థుల లగ్జరీ బిల్డింగ్ అది. రీ మోడలింగ్ తర్వాత దాని ప్రస్తుత విలువ 250 కోట్లు అని సమాచారం.
రాహా కపూర్ పేరు మీద రిజిస్ట్రేషన్
రెండేళ్ల రాహాకు భారీ ఆస్తి
అయితే రణబీర్ – అలియా జంట ఆ ఇంటిని రాహా కపూర్ పేరు మీద ఇటీవల రిజిస్టర్ చేయించారని సమాచారం. త్వరలో ఈ జంట తమ కూతురుతో కలిసి ఆ ఇంటికే షిఫ్ట్ అయిపోతారని కూడా వినిపిస్తుంది. ఆ ఇల్లు రణబీర్ కుటుంబ వారసత్వానికి గుర్తు. అలాంటి ఖరీదైన ఇంటిని తన కూతురి పేరు మీద అప్పుడే రిజిస్టర్ చేయించడంతో అంతా షాక్ అవుతున్నారు. దీంతో రెండేళ్ల రాహా 250 కోట్లకు వారసురాలు అనే వార్త వైరల్ గా మారింది.
రణబీర్ మరియు అలియా తమ కూతురు రాహా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. 250 కోట్ల ఆస్తితో రాహా భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.
