
📌 Key Points
- నటుడు రాహుల్ రామకృష్ణ సోదరుడు పారాక్వాట్ పురుగుమందు కారణంగా మరణించారు.
- పారాక్వాట్ పురుగుమందును బ్యాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోడీకి రాహుల్ విజ్ఞప్తి చేశారు.
- పారాక్వాట్ కారణంగా ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
- రాహుల్ రామకృష్ణ కుటుంబానికి సినీ ప్రముఖులు, అభిమానులు సానుభూతి తెలుపుతున్నారు.
టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు పారాక్వాట్ అనే పురుగుమందు సేవించి మరణించారు. దీనితో రాహుల్ రామకృష్ణ ఈ పురుగుమందును బ్యాన్ చేయాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రాహుల్ రామకృష్ణ సోదరుడి మరణం
Rahul Ramakrishna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ఒకరు. భరత్ అనే నేను, గీత గోవిందం, జాతి రత్నాలు వంటి సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో ప్రధాన నటుడిగా కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా రాహుల్ రామకృష్ణ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రాహుల్ రామకృష్ణ సోదరుడు మరణించడంతో ఈయన సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు .అదేవిధంగా తన తమ్ముడి మరణానికి కారణం పారాక్వాట్(Paraquat) అనే పురుగుమందు కారణమని తెలిపారు.
పారాక్వాట్ అనే గడ్డి మందు రసాయనం కారణంగా తన సోదరుడు మరణించారని, ఈ రసాయనాన్ని బ్యాన్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలను కాపాడాలి అంటూ ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పిఎం నరేంద్ర మోడీని రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అత్యంత విషపూరితమైన ఈ రసాయనం తెలంగాణలో చాలా విరివిగా లభిస్తుంది. ఈ రసాయనం కారణంగా మరణాల సంఖ్య కూడా అధికమవుతుందని రాహుల్ రామకృష్ణ తెలిపారు. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునేవారు ఈ హానికర రసాయనాన్ని కొనుగోలు చేస్తూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈయన తెలిపారు.
ఇలాంటి హానికరమైన రసాయనాన్ని వీలైనంత త్వరగా బ్యాన్ చేయాలని కోరుతూ ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నరేంద్ర మోడీని కూడా రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇలా పురుగు మందు కారణంగానే తన సోదరుడు మరణించారని ఈయన ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఎంతోమంది రాహుల్ రామకృష్ణకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఈ హానికర రసాయనాన్ని బ్యాన్ చేసి రైతుల ప్రాణాలను నిలబెట్టాలి అంటూ కోరుతున్నారు.
పారాక్వాట్ బ్యాన్ చేయాలని రాహుల్ విజ్ఞప్తి
Honourable Sirs @TelanganaCMO @PMOIndia , Lost my brother today to Paraquat poisoning. It’s terrifyingly lethal and widely misused for self-destruction. Shocked by how easily it is available everywhere. Doctors are overwhelmed by the amount of cases.Please ban it ASAP-save lives🙏🏽
— Rahul Ramakrishna (@eyrahul) March 26, 2026
రాహుల్ కుటుంబానికి సినీ ప్రముఖుల సానుభూతి
ఇక రాహుల్ రామకృష్ణ సోదరుడు మరణించారనే విషయం తెలిసిన ఆయన అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ రాహుల్ రామకృష్ణ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక రాహుల్ రామకృష్ణ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన పలు సినిమాలలో నటిస్తూఎంతో బిజీగా ఉన్నారు .ఇక రాహుల్ రామకృష్ణ హుషారు 2 సినిమా షూటింగ్ లో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఈయన చిన్న ప్రమాదానికి గురయ్యారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ ప్రమాదం కారణంగా భయపడాల్సిన పనిలేదని స్వల్ప గాయాలు కావడంతో పెద్ద ప్రమాదం ఏమి చోటు చేసుకోలేదని తెలుస్తోంది.
రాహుల్ రామకృష్ణ తన సోదరుడిని కోల్పోవడం బాధాకరం. పారాక్వాట్ పురుగుమందును బ్యాన్ చేస్తే మరికొంతమంది ప్రాణాలు కాపాడవచ్చని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.


