|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కమెడియన్ రాహుల్ రామకృష్ణ డైరెక్షన్ లో సినిమా, యాక్టింగ్ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

Published: 14-06-2025, 7:25 AM
కమెడియన్ రాహుల్ రామకృష్ణ డైరెక్షన్ లో సినిమా, యాక్టింగ్ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

ప్రముఖ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ తన తొలి దర్శకత్వ చిత్రం ప్రకటించారు. ఈ సినిమా కోసం ఆయన నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఆసక్తిగలవారు తమ షోరీల్స్ పంపాలని కోరుతున్నారు.

Key Points

1

నటుడిగా, కమెడియన్ గా రాణించిన రాహుల్ రామకృష్ణ దర్శకుడిగా మారుతున్నారు.

2

తన తొలి చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్నారు.

4

సినిమా వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడించబడతాయి.

రాహుల్ రామకృష్ణ దర్శకుడిగా

తెలుగు సినిమా అభిమానులకు నటుడిగా బాగా పరిచయమైన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరీ ముఖ్యంగా అర్జున్ రెడ్డి, భరత్ అనే నేను, లాంటి సినిమాలలో సీరియస్ క్యారెక్టర్స్ చేసి.. ‘జాతిరత్నాలు’ వంటి విజయవంతమైన చిత్రాల్లో కామెడీతో కడుపుబ్బా నవ్వించిన రామకృష్ణ.. తన హాస్యంతో పాటు సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మల్టీ టాలెంటెడ్ అని ఇప్పటికే నిరూపించుకున్న రాహుల్, ఈసారి దర్శకుడిగా మారేందుకు సన్నాహాలు ప్రారంభించారు.

ఈ విషయాన్ని ఆయన ఈరోజు (జూన్ 14) ఉదయం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ‘ఎక్స్’ లో ఒక పోస్ట్‌ ద్వారా ఈ విషయం తెలియజేస్తూ.. ఈ విధంగా రాశారు. దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్‌. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే దయచేసి మీ షోరీల్స్‌, ఫొటోల‌ను నా మెయిల్‌కు పంపించండి, అని పేర్కొన్నారు. ఈ సినిమాకు ఆయనే నిర్మాతగా వ్యవహరించనున్నారు.

నటీనటుల ఎంపిక

ఇక టాలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, రాహుల్ రామకృష్ణ తన కథను ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అయితే సినిమా కథ, హీరో హీరోయిన్లు, సాంకేతిక బృందం వంటి ఇతర వివరాలు ఇప్పటికీ సీక్రేట్ గానే ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నట్టు సమాచారం.

గతంలో రచయితగా, జర్నలిస్టుగా పని చేసిన అనుభవం ఉన్న రాహుల్‌కి కథనంపై మంచి పట్టుంది. అర్జున్ రెడ్డి సినిమాలోని శివ పాత్రతో రాహుల్ సినిమా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. 2017లో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన, గీత గోవిందం, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో వంటి అనేక సినిమాల్లో అద్భుతంగా నటించి అభిమానులను సంపాదించుకున్నారు.

సినిమా వివరాలు

నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు పొందిన రాహుల్, దర్శకత్వంలో కూడా అదే స్థాయిలో ప్రత్యేకత చూపించబోతున్నట్టు తెలుస్తోంది. రాబోయే నెలల్లో ఈ సినిమా వివరాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే నటన కోసం ఆసక్తిగల వారు తమ వివరాలను పంపాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

రాహుల్ రామకృష్ణ దర్శకత్వ ప్రయోగం ఎలా ఉంటుందో చూడాలి. త్వరలోనే సినిమా వివరాలు వెలువడతాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.