
నటుడు రాహుల్ రామకృష్ణ కేసీఆర్ కంబ్యాక్, మహాత్మా గాంధీపై సంచలన ట్వీట్లు చేసి టాలీవుడ్‌లో చర్చకు దారితీశారు. రాజకీయ పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారగా, వెంటనే తన ఎక్స్ ఖాతాను తొలగించడం ఆసక్తిని రేపింది.
Key Points
నటుడు రాహుల్ రామకృష్ణ కేసీఆర్ కంబ్యాక్ కోరుతూ, గాంధీపై షాకింగ్ ట్వీట్లు చేశారు.
రాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి.
గాంధీ జయంతి రోజున 'గాంధీ అసలు మహాత్ముడే కాదు' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ట్వీట్లు చేసిన కొన్ని గంటల్లోనే రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను డిలీట్ చేశారు.
రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్లు
Rahul Ramakrishna: టాలీవుడ్ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గురించి ప్రస్తావించిన ఆయన ఎక్స్ వేదికగా వరుస ట్వీట్స్ వేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మహాత్మా గాంధీని ప్రస్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. (Rahul Ramakrishna)దాంతో ఈ నటుడు చేసిన ట్వీట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
కేసీఆర్, గాంధీపై నటుడి వ్యాఖ్యలు
Bomb Threat: స్టాలిన్, త్రిష ఇళ్లకు బాంబు బెదిరింపులు.. చెన్నైలో భద్రత కట్టుదిట్టం.. రంగంలోకి బాంబు, డాగ్ స్క్వాడ్
ఎక్స్ ఖాతా డిలీట్.. కారణమేంటి?
సోషల్ మీడియాలో ఆయన స్పందిస్తూ.. “ప్రస్తుతం మనం భయంకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. డబుల్ డోర్ కం బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను అంటూ కేటీఆర్ ను ట్యాగ్ చేసాడు. అలాగే.. నేను విసిగిపోయాను, నన్ను చంపేయండి, హైదరాబాద్ మునిగిపోయింది, హామీలన్నీ విఫలమయ్యాయి, ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రజలు మిమ్మల్ని పిలుస్తున్నారు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్” ను ట్యాగ్ చేశాడు. అంతటితో ఆగకుండా.. “గాంధీ సాధువు కాదు.. అసలు అతను మహాత్ముడే కాదంటూ” అంటూ మరో ట్వీట్ చేసి షాకిచ్చాడు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున రాహుల్ ఇలాంటి పోస్టులు పెట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పోస్టులు పెట్టిన కొన్ని గంటల్లోనే రాహుల్ తన ఎక్స్ ఖాతాను డిలీట్ చేయడం విశేషం. అయితే, రాహుల్ రామకృష్ణ ఎందుకు ఎలాంటి పోస్టులు పెట్టాడు? తరువాత తన ఎక్స్ అకౌంట్ ను ఎందుకు డిలీట్ చేశాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి, రాహుల్ రామకృష్ణ తన షాకింగ్ ట్వీట్‌లతో తీవ్ర చర్చను సృష్టించారు. తన ఎక్స్ ఖాతాను తొలగించడంతో ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.


