|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ప్రభాస్ రాజాసాబ్ ఊచకోత.. బాక్సాఫీస్ బద్దలు! 200 కోట్లు కొల్లగొట్టిన వైనం!!

Updated: 13-01-2026, 8:03 AM
  • ప్రభాస్ రాజాసాబ్ మూవీ మొదటి రోజు కలెక్షన్లు: రూ.112 కోట్లు గ్రాస్!
  • కేవలం నాలుగు రోజుల్లోనే రాజాసాబ్ రూ.201 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
  • ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు.
  • సంక్రాంతి కానుకగా జనవరి 9న రాజాసాబ్ మూవీ విడుదల అయింది.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. మొదటి రోజు నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. సంక్రాంతి సెలవుల్లో ఈ సినిమాకు భారీగా ఆదరణ లభిస్తోంది.

రాజాసాబ్ మొదటి రోజు కలెక్షన్ల మోత!

Raja Saab Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజాసాబ్. కామెడీ అండ్ హారర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు మారుతీ తెరకెక్కించాడు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ డాట్ కీ రోల్ చేశాడు. పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా జనవరి 9న రాజాసాబ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది రాజాసాబ్(Raja Saab Collection). కథ, కథనాలు రొటీన్ గా ఉండటంతో ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు నెగిటీవ్ టాక్ వచ్చింది. అయినా కూడా కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో రాబడుతోంది రాజాసాబ్. మొదటి రోజు ఏకంగా రూ.112 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈసినిమా రెండు రోజుల్లోనే రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టింది.

నెగెటివ్ టాక్ ఉన్నా కలెక్షన్ల సునామీ ఎలా?

ఇక నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.201 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. నిజానికి ప్రభాస్ రేంజ్ కి ఈ కలెక్షన్స్ చాలా అంటే చాలా తక్కువ. కానీ. మొదటిరోజు నుంచే మిక్సుడ్ టాక్ తెచ్చుకున్న ఒక సినిమా ఆ తరువాత కూడా స్టడీగా కలెక్షన్స్ రాబట్టడం మాములు విషయం కాదు. పోటీలో చిరంజీవి హీరోగా వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ కూడా ఉంది. వాటిని దాటుకొని ఆడియన్స్ నుంచి మంచి వసూళ్లను రాబడుతోంది ఈ మూవీ.

సంక్రాంతి సెలవులే రాజాసాబ్ కు కలిసొచ్చాయా?

అయితే, సంక్రాంతి పండుగ సీజన్ రాజాసాబ్ సినిమాకు బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇప్పటికి రెండే సినిమాలు విడుదల అయ్యాయి కాబట్టి, ఈ మాత్రం కలెక్షన్స్ రావడం సహజమే. కానీ, మంగళవారం నుంచి ఈ సినిమాకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది చూడాలి. మరి ఫైనల్ గా రాజాసాబ్ సినిమాకు ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా అనేది చూడాలి.

రాజాసాబ్ కలెక్షన్ల జోరు కొనసాగుతుందా లేదా చూడాలి. ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.