
ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. సినిమా ఫస్ట్ సాంగ్, ట్రైలర్ విడుదల తేదీల గురించి నిర్మాత విశ్వప్రసాద్ వివరణ ఇచ్చారు.
Key Points
రాజాసాబ్ సినిమా ఫస్ట్ సాంగ్ అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజున విడుదల.
కొత్త థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 2 నుంచి కాంతార చాప్టర్ 1 తో పాటు విడుదల.
సినిమా షూటింగ్ పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
సంప్రదాయ వాయిదాల తర్వాత, సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
రాజాసాబ్ సాంగ్ & ట్రైలర్ విడుదల తేదీలు
Raja Saab : ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ మొదటిసారి హారర్ కామెడీ జానర్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేసి హైప్ పెంచారు. అయితే ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇప్పుడు సంక్రాంతికి వస్తుందని అంటున్నారు.(Raja Saab)
ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై విశ్వ ప్రసాద్ నిర్మాణంలో మారుతీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తేజ సజ్జా మిరాయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత విశ్వ ప్రసాద్ నేడు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో రాజాసాబ్ సినిమా అప్డేట్ గురించి తెలిపారు.
సినిమా తాజా అప్డేట్స్
Also See : Bigg Boss Promo : బిగ్ బాస్ 9 డే 2 ప్రోమో.. అప్పుడే ఏడుపులు.. వాష్ రూమ్ గొడవలు..
ప్రభాస్ హారర్ కామెడీ ఎంట్రీ
విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. రాజాసాబ్ మొదటి పాట ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23న వస్తుంది. అలాగే థియేటరికల్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేస్తాం. ఆ ట్రైలర్ కాంతార చాప్టర్ 1 సినిమాతో అక్టోబర్ 2 నుంచి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అని తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ట్రైలర్, సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.
చివరగా, రాజాసాబ్ సినిమా అభిమానులకు శుభవార్త. పాట, ట్రైలర్ విడుదల తేదీలు ఖరారయ్యాయి. సంక్రాంతికి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.


