
రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న SSMB-29 సినిమా ‘వారణాసి’ అప్డేట్స్‌తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళిపై షాకింగ్ కామెంట్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Key Points
SSMB-29 ప్రాజెక్ట్‌కు 'వారణాసి' అనే టైటిల్ ఖరారైంది, గ్లింప్స్ కూడా విడుదల చేశారు.
నవంబర్ 15న 'Globetrotter' ఈవెంట్‌లో సినిమా వివరాలు వెల్లడించి అభిమానులను అలరించారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ 'వారణాసి'లో కుంభ పాత్రలో నటిస్తుండగా, రాజమౌళి టార్చర్ పెడుతున్నారని కామెంట్ చేశారు.
తన పాత్ర శారీరకంగా, మానసికంగా సవాలు విసిరేదని, ఇంత లాంచ్ ఎక్కడా చూడలేదని పృథ్వీరాజ్ తెలిపారు.
SSMB-29: “వారణాసి” వివరాలు, గ్లింప్స్ విడుదల
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘SSMB-29’సంబంధించిన పోస్టులే దర్శనమిస్తున్నాయి. అంతటా ఈ సినిమా సందడి మొదలైపోయింది. మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి (Rajamouli)కాంబోలో రాబోతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘వారణాసి’(Vaaranaasi)టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశారు. ఇక ఈ అప్డేట్స్‌ను విడుదల చేసేందుకు నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ‘Globetrotter’ పేరుతో ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించి అభిమానులకు వరుస సర్‌ప్రైజులు ఇచ్చారు.
పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్: రాజమౌళి టార్చర్
ఇందులో ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తుండగా.. పథ్వీరాజ్ సుకుమారణ్ కుంభ పాత్రలో కనిపించనున్నాడు. ఇక మహేష్ బాబు రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. పురాణాలలో, సంస్కృతిలో అండ్ పండుగలలో కనిపించే బసవ ఎద్దుపై వస్తున్న లుక్‌లో ఫ్యాన్స్‌కు ఫుల్ మీట్స్ పెట్టేశాడు రాజమౌళి. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘రాజమౌళి గారు నా తదుపరి సినిమాలో విలన్ పాత్ర చాలా బాగా వచ్చిందని నాకు మెసేజ్ చేశారు. ఆ తర్వాత ఒకచోట కలుసుకున్నాం.
పృథ్వీరాజ్ కుంభ పాత్ర: శారీరక, మానసిక సవాళ్లు
ఐదు నిమిషాల స్టోరీ చెప్పగానే ‘వారణాసి’ చేయడానికి ఒప్పుకున్నాను. ఆ తర్వాత మూడు గంటల పాటు కథ చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. రాజమౌళిలా మరొకరిని ఊహించలేకపోయాను. ఆయన ఎంతగానో నమ్మి కుంభ పాత్ర నాకు ఇచ్చారు. శారీరకంగా, మానసికంగా నాకు సవాలు విసిరింది. రాజమౌళి నిజంగా షూటింగ్ టార్చర్ పెడుతున్నారు. నేను చాలా భాషల్లో చాలా సినిమాలు చేశాను, కానీ ఈ స్థాయిలో లాంచ్ ఎక్కడా చూడలేదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు ‘వారణాసి’పై అంచనాలను మరింత పెంచాయి. రాజమౌళి తన సినిమాల కోసం నటుల నుండి ఎంత కృషిని రాబడతారో మరోసారి నిరూపించాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


