
నటుడు రాజీవ్ కనకాల ఇటీవల విడుదలైన ‘చాయ్ వాలా’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సినిమా కథ, నటీనటుల పనితీరు గురించి ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Key Points
రాజీవ్ కనకాల 'చాయ్ వాలా' సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
సినిమా కథ విని ఆశ్చర్యపోయానని, ఎంతో ఎమోషనల్‌గా ఉంటుందని రాజీవ్ అన్నారు.
శివ కందుకూరిని 'ఆకలితో ఉన్న ఆర్టిస్ట్' అని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.
నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు కోసం ఎంతో కృషి చేస్తున్నారని రాజీవ్ ప్రశంసించారు.
‘చాయ్ వాలా’ సినిమాపై రాజీవ్ కనకాల అభిప్రాయాలు
కీలక పాత్రల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకన్నారు నటుడు రాజీవ్ కనకాల. ఇటీవల కాలంలో తండ్రి పాత్రలో కనిపిస్తున్న రాజీవ్ కనకాల నటించిన లేటెస్ట్ సినిమా చాయ్ వాలా . రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన చాయ్ వాలా సినిమాలో రాజీవ్ కనకాల టీ హోటల్ యజమానిగా నటించాడు.
చాయ్ వాలా సినిమాలో హీరోగా శివ కందుకూరి చేయగా హీరోయిన్‌గా తేజు అశ్విని చేస్తోంది. హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు చాయ్ వాలా సినిమా నిర్మించారు. ప్రమోద్ హర్శ రచన, దర్శకత్వం వహించిన చాయ్ వాలా టీజర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చాయ్ వాలా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హీరో తండ్రి, నిర్మాత రాజ్ కందుకూరితోపాటు సినిమా విశేషాలు చెప్పారు.
శివ కందుకూరి నటనపై రాజీవ్ ప్రశంసలు
రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. “నిర్మాత వెంకట్ రెడ్డి గారు ‘చాయ్ వాలా’ కోసం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ మూవీతో ఆయనకు పెద్ద విజయం రాబోతోంది. హర్షిక బ్యానర్ ఇండస్ట్రీలో సెటిల్ అవుతుంది. ప్రమోద్ హర్ష నాకు ‘ఉంగరాల రాంబాబు’ టైంలో పరిచయం” అని అన్నారు.
“ప్రమోద్ చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను. ‘చాయ్ వాలా’ కథ నాకు చాలా నచ్చింది. ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటూనే ఎమోషన్స్ ఉంటాయి. ప్రమోద్ ఏడాదికి కనీసం రెండు చిత్రాలైనా ఆయన చేయాలి. ప్రతీ సీన్‌ను ఎంతో వివరించి నటీనటుల నుంచి నటనను రాబట్టుకునేవాడు” అని రాజీవ్ కనకాల తెలిపారు.
నిర్మాత రాజ్ కందుకూరి కృషిపై రాజీవ్ వ్యాఖ్యలు
“రాజ్ కందుకూరి గారు ఈ సినిమా మీద మా అందరి కంటే ఎక్కువ నమ్మకంగా ఉండేవారు. కొడుకు కోసం ఆయన ఎంతో చేస్తుంటారు. ‘చాయ్ వాలా’ని ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. కసిరెడ్డి అద్భుతమైన నటుడు. మా డీఓపీ క్రాంతి ఎంతో వేగంగా పని చేసేవారు. రచయిత ఇమ్రాన్ గారు కూడా సెట్స్‌కి వచ్చి సపోర్ట్ చేస్తుండేవారు. సుప్రియ గారి ఆర్ట్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది” అని రాజీవ్ కనకాల చెప్పారు.
“తేజు అశ్వినితో నాకు కొన్ని సీన్లే ఉంటాయి. తేజు చాలా చక్కగా నటించారు. శివ కందుకూరి బోలెడంత ఆకలితో ఉన్న ఆర్టిస్ట్. నా పక్కన ఎక్కడా తగ్గకుండా ఉండాలని ఎంతో తపన పడి నటించేవాడు. ఆ ఆకలితో ఉన్న శివ కందుకూరి ఎంతో ఎత్తుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘చాయ్ వాలా’ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని రాజీవ్ కనకాల తన స్పీచ్ ముగించారు.
చివరగా, రాజీవ్ కనకాల ‘చాయ్ వాలా’ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశించారు. సినిమా యూనిట్ అందరి కృషిని ఆయన ప్రశంసించారు.


