|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అలీపై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. అసభ్య పదం వాడిన సీనియర్ యాక్టర్.. ఆగ్రహిస్తున్న నెటిజన్లు

Published: 01-06-2025, 9:44 AM
అలీపై నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. అసభ్య పదం వాడిన సీనియర్ యాక్టర్.. ఆగ్రహిస్తున్న నెటిజన్లు

ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన తాజా వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కమెడియన్ అలీపై ఆయన చేసిన అసభ్య వ్యాఖ్యలు నెటిజన్ల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Key Points

1

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అలీపై అసభ్య వ్యాఖ్యలు చేశారు.

2

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

4

రాజేంద్ర ప్రసాద్ ఇంతకుముందు కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అలీపై రాజేంద్ర ప్రసాద్ అసభ్య వ్యాఖ్యలు

సీనియర్ నటుడు, అలనాటి హీరో రాజేంద్ర ప్రసాద్ ఇటీవలి కాలంలో తరచూ నోరు జారుతున్నారు. వేదికలపై అదుపు తప్పి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోసారి అదే తీరు కొనసాగించారు రాజేంద్ర ప్రసాద్. స్టార్ కమెడియన్ అలీపై తాజాగా అసభ్య కామెంట్ చేశారు. ఆ వివరాలు ఇవే..

ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్‍వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నేడు (జూన్ 1) ఓ కార్యక్రమం జరిగింది. దీనికి రాజేంద్ర ప్రసాద్ , మురళీమోహన్‍, శ్రీకాంత్, అలీతో పాటు చాలా మంది నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.

అలీ ఎక్కడ అంటూ ఓ అసభ్య పదాన్ని రాజేంద్ర ప్రసాద్ వాడారు. “ఏరా అలీగా.. ఎక్కడ ఆ ల******కు.. ఇటురా బే” అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అలీ నవ్వినా ఇబ్బంది పడినట్టు కనిపించింది.

వైరల్ అవుతున్న వీడియో

తాను ఎన్టీఆర్ అవార్డు తీసుకునేందుకు విజయవాడ వెళ్లాల్సి వచ్చిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అవార్డు విషయం చెప్పినా ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో ఆయన మళ్లీ నోటికొచ్చినట్టు మాట్లాడారు. “చప్పట్లు కొట్టరా.. బుద్ది ఉందా లేదా.. ఎన్టీఆర్ అవార్డు అంటే చప్పట్లు కొట్టారా.. బ్రెయిన్ పోయిందా” అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. చెప్పి మరీ కొట్టించుకుంటున్నారని మురళీ మోహన్ సరదాగా అంటే.. దానికి చప్పట్లు కొట్టకపోతే సిగ్గులేనట్టు లెక్క అని నోరు జారారు రాజేంద్ర ప్రసాద్.

అలీపై అభ్యంతరకరంగా మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్‍పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నటుడు పదేపదే ఇలా అసభ్యంగా, వివాదాస్పదంగా మాట్లాడడం సరికాదని ఆగ్రహిస్తున్నారు. ఏదైనా కార్యక్రమానికి ఆయనను పిలిచేందుకు ఆలోచించుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అలీకి ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

నెటిజన్ల ఆగ్రహం

ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ పై కూడా ఇటీవల రాబిన్‍హుడ్ సినిమా ప్రమోషన్లలో నోరు జారారు రాజేంద్ర ప్రసాద్. ఆ చిత్రంలో క్యామియో రోల్‍లో నటించిన వార్నర్‌పై అసభ్య పదం వాడారు. దీంతో రాజేంద్ర ప్రసాద్‍పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు అలీపై నోరు జారారు.

కాగా, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన షష్టిపూర్తి చిత్రం మే 30వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అర్చన, రూపేశ్, ఆకాంక్ష సింగ్ కూడా ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీకి పవన్ ప్రభ దర్శకత్వం వహించగా.. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు.

రాజేంద్ర ప్రసాద్ చేసిన అసభ్య వ్యాఖ్యలపై నెటిజన్ల తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఆయన తన తప్పును గ్రహించి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.