|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

46 ఏళ్ల తర్వాత రజనీ, కమల్‌ మల్టీస్టారర్‌.. బాక్సాఫీస్‌ బద్దలే!

Published: 08-09-2025, 2:17 AM
46 ఏళ్ల తర్వాత రజనీ, కమల్‌ మల్టీస్టారర్‌.. బాక్సాఫీస్‌ బద్దలే!

తెలుగు సినిమా ప్రేక్షకుల కల నిజమవబోతోంది! 46 ఏళ్ల తర్వాత రజనీకాంత్ మరియు కమల్ హాసన్ ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారు. కమల్ హాసన్ ఈ విషయాన్ని సైమా అవార్డుల వేడుకలో వెల్లడించారు.

Key Points

1

46 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్ సినిమా!

2

సైమా అవార్డుల వేడుకలో కమల్ హాసన్ చేసిన అనౌన్స్‌మెంట్!

4

సినిమా వివరాలను కమల్ హాసన్ ఇంకా వెల్లడించలేదు.

రజనీ, కమల్ కాంబో సినిమా ప్రకటన

రజనీకాంత్ ‌, కమల్ ‌ హాసన్ ‌.. భారతీయ చిత్రపరిశ్రమలో అగ్ర హీరోలుగా ఉన్న వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయాలని చాలా మంది సినీ ప్రియులు కోరుకుంటున్నారు . వీళ్ల కాంబోలో సినిమా రాబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు కూడా వస్తున్నాయి . కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు . పైగా ఈ సినిమాపై అటు రజనీ కానీ , ఇటు కమల్ ‌ కానీ స్పందించకపోవడంతో .. ఇదంతా పుకారే అనుకున్నారు . కానీ త్వరలోనే సినీ ప్రియుల కల నిజం కాబోతుంది . కమల్ ‌, రజనీలను ఒకే స్క్రీన్ ‌ పై చూడబోతున్నారు . తాజాగా ఈ విషయాన్ని కమల్ ‌ హాసన్ ‌ అధికారికంగా ప్రకటించాడు .

46 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్

ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకల్లో పాల్గొన్న కమల్ ‌.. రజనీతో సినిమాపై స్పందించాడు . ‘ ప్రేక్షకుల సంతోషమే మాకు ముఖ్యం . మేమిద్దరం కలిసి నటించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం . కానీ ఇన్నాళ్లు అది కుదరలేదు . త్వరలోనే మేమిద్దరం మీ ముందుకు రాబోతున్నాం . ఆ సినిమా మిమ్మల్ని సర్ ‌ ప్రైజ్ ‌ చేస్తుంది ’ అని కమల్ ‌ అన్నారు .

బాక్సాఫీస్ అంచనాలు

దీంతో ఇరువురి ఫ్యాన్స్ ‌ తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు . 1979 లో వ‌చ్చిన అల్లాయుద్దీన్ అద్భుత దీపం తర్వాత వీరిద్దరు కలిసి నటించలేదు. దాదాపు 46 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోబుతున్నారు. సినిమాకు కాస్త హిట్‌ టాక్‌ వచ్చినా బక్సాఫీస్‌ బద్దలవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను మాత్రం కమల్‌ వెళ్లడించలేదు. గతంలో లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వీరిద్దరి సినిమా ఉంటుందని రూమర్స్‌ వచ్చాయి.

రజనీకాంత్ మరియు కమల్ హాసన్ల కాంబో సినిమా ప్రకటనతో అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అంచనాలున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.