|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రజనీకాంత్ సినిమాకు పెద్ద షాకే ఇచ్చిన సెన్సార్ బోర్డు.. అసలు ఈ మూవీని సలార్‌తో ఎందుకు పోలుస్తున్నారో తెలుసా?

Published: 01-08-2025, 12:16 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు నాగార్జున నటించిన ‘కూలీ’ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నిర్ణయం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాను సలార్ సినిమాతో పోలుస్తున్న కారణాల గురించి కథనంలో తెలుసుకుందాం.

Key Points

1

రజనీకాంత్, నాగార్జున నటించిన 'కూలీ' సినిమాకు సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ ఇచ్చింది.

2

సెన్సార్ బోర్డు నిర్ణయం రజనీకాంత్ అభిమానులను షాక్‌కు గురిచేసింది.

3

'కూలీ' సినిమాను సలార్ సినిమాతో పోలుస్తూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.

4

ఆగస్టు 14న 'కూలీ' సినిమా 'వార్ 2' తో పోటీ పడుతోంది.

‘కూలీ’ సినిమాకు ‘A’ సర్టిఫికెట్

సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున నటించిన మూవీ కూలీ (Coolie). ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ కావడంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ మూవీ టీమ్ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టింది. అయితే తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు పెద్ద షాకే ఇచ్చింది.

రజనీకాంత్ నటించిన కూలీ మూవీకి సెన్సార్ బోర్డు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. ఇది రజనీ అభిమానులను షాక్ కు గురి చేసింది. సూపర్ స్టార్ సినిమాకు ఇలాంటి సర్టిఫికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఎ సర్టిఫికెట్ పొందిన తొలి మూవీ కూడా ఇదే.

దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మూవీలో ఉన్న మితిమీరిన వయోలెన్స్ వల్ల ఇలా చేశారా లేక మరేదైనా కారణం ఉందా అన్నది మూవీ చూస్తేనే తెలుస్తుంది. తమ మూవీకి ఎ సర్టిఫికెట్ వచ్చిన విషయాన్ని కూలీ మూవీ టీమ్ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

సలార్‌తో పోలికలు

రజనీకాంత్ మూవీ కూలీ కి ఎ సర్టిఫికెట్ వచ్చిందన్న వార్త రాగానే చాలా మంది అభిమానులు సలార్ తో పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీని వెనుక ఓ బలమైన కారణమే ఉంది. దానివల్లే కూలీ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని వాళ్లు బలంగా నమ్ముతున్నారు. ఇంతకీ వైరల్ అవుతున్న ఆ ట్వీట్ లో ఏముందంటే..

“కూలీ వర్సెస్ సలార్.. హీరో పేరు దేవా.. ఎ సర్టిఫికెట్.. లవ్ ట్రాక్ లేదు.. ఫస్టాఫ్ డ్రామా, సెకండాఫ్ వయోలెన్స్.. రెండు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన తర్వాత వచ్చిన డైరెక్టర్లే.. విలన్ మరో ఇండస్ట్రీకి చెందినవాడు.. సినిమాలో శృతి హాసన్ ఉంది.. ఓ పెద్ద బాలీవుడ్ సినిమాతో పోటీ” అనే క్యాప్షన్ తో ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే అప్పుడు ఎ సర్టిఫికెట్ తో సలార్ బ్లాక్‌బస్టర్ కావడంతో ఇప్పుడు కూలీ కూడా అలాగే సక్సెస్ అవుతుందన్నది వాళ్ల నమ్మకం.

‘వార్ 2’ తో పోటీ

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూలీ. ఈ సినిమాలో నాగార్జున విలన్ గా నటిస్తుండటం విశేషం. అతనితోపాటు ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్ కూడా నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది.

అదే రోజు పాన్ ఇండియా మూవీ వార్ 2 కూడా వస్తుండటంతో ఈ రెండింటి మధ్య బాక్సాఫీస్ వార్ నడవనుంది. వార్ 2లో హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఆ సినిమా కూడా తెలుగులోనూ వస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూలీ, వార్ 2 మధ్య గట్టి పోటీ ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

చివరగా, ‘కూలీ’ సినిమా ‘A’ సర్టిఫికెట్‌తో విడుదల కావడం, సలార్ సినిమాతో పోలికలు, మరియు ‘వార్ 2’ తో బాక్సాఫీస్ పోటీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.