|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Raju Weds Rambai : సూపర్ హిట్ సినిమా.. రాజు వెడ్స్ రాంబాయిని మిస్ చేసుకున్న నలుగురు హీరోలు ఎవరో తెలుసా..?

Published: 03-12-2025, 1:10 AM
Raju Weds Rambai : సూపర్ హిట్ సినిమా.. రాజు వెడ్స్ రాంబాయిని మిస్ చేసుకున్న నలుగురు హీరోలు ఎవరో తెలుసా..?
  • రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రం రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసి హిట్ అయింది.
  • డైరెక్టర్ సాయిలు కంపాటి ప్రకారం, ఈ కథను మొదట నలుగురు యువ హీరోలు తిరస్కరించారు.
  • రాహుల్ రామకృష్ణ, సుమంత్ ప్రభాస్, విరాట్ కర్ణ, రోషన్ ఈ చిత్రాన్ని వదులుకున్న హీరోలు.
  • కొత్త హీరో అఖిల్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తన నటనతో విజయాన్ని అందుకున్నాడు.

“రాజు వెడ్స్ రాంబాయి” సినిమా భారీ విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద రూ. 20 కోట్లు వసూలు చేసింది. అయితే, ఈ బ్లాక్‌బస్టర్‌ను మొదట నలుగురు యువ హీరోలు మిస్ చేసుకున్నారని డైరెక్టర్ సాయిలు కంపాటి ఇటీవల వెల్లడించారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

“రాజు వెడ్స్ రాంబాయి” ఘన విజయం

Raju Weds Rambai : అఖిల్, తేజస్వి జంటగా సాయిలు దర్శకత్వంలో తెరకెక్కిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా ఇటీవల రిలీజయి పెద్ద హిట్ అయింది. కేవలం 2 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే ఈ సినిమా ఆల్మోస్ట్ 20 కోట్లు కలెక్ట్ చేసింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో నిజంగా జరిగిన ఓ లవ్ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా హిట్ అవ్వడంతో కొత్త హీరో -హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ లకు మంచి ఫేమ్ వచ్చింది.(Raju Weds Rambai)

అయితే ఇంత పెద్ద హిట్ అయినా సినిమాని నలుగురు హీరోలు వదిలేసుకున్నారట. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు కంపాటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం తెలిపాడు.

డైరెక్టర్ సాయిలు కంపాటి వెల్లడి

సాయిలు కంపాటి మాట్లాడుతూ.. రాహుల్ రామకృష్ణకు 2017 సమయంలోనే ఈ కథని ల్యాప్ టాప్ లో టైప్ చేయించి పంపించాను. అతనికి ఈ కథ ఎక్కలేదు. అతని నుంచి రిప్లై ఏం రాలేదు. రెండు మూడు సార్లు అప్రోచ్ అయ్యాను కానీ వర్కౌట్ అవ్వలేదు. డైరెక్ట్ గా కలిసి నేరేషన్ మాత్రం ఇవ్వలేదు రాహుల్ రామకృష్ణకు. ఆ తర్వాత సుమంత్ ప్రభాస్ కి నేరేషన్ ఇచ్చాను. అతనికి బాగా నచ్చింది కానీ ఎందుకో ఆగిపోయాడు. ఆ తర్వాత పెదకాపు హీరో విరాట్ కర్ణకు చెప్పాను, ఆయనకు కూడా ఈ కథ ఎక్కలేదు. యాంకర్ సుమ కొడుకు రోషన్ కి కూడా చెప్పాను కానీ ఆయనకు కూడా ఈ కథ ఎక్కలేదు అని తెలిపాడు.

సినిమాను వదులుకున్న నలుగురు హీరోలు

అలా ఈ నలుగురు మంచి సినిమాని మిస్ చేసుకున్నారు. దీంతో కొత్త హీరో అఖిల్ ఈ ఛాన్స్ ని సరిగ్గా ఉపయోగించుకొని బాగా నటించి హిట్ అందుకున్నాడు.

“రాజు వెడ్స్ రాంబాయి” వంటి ఒక గొప్ప కథను నలుగురు యువ హీరోలు వదులుకోవడంతో, కొత్త హీరో అఖిల్‌కు అవకాశం లభించింది. ఇది కేవలం అతని కెరీర్‌కు మైలురాయిగా నిలవడమే కాకుండా, సరైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంత ముఖ్యమో నిరూపించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.