
బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో కనిపించగా, ఆమె మెడపై ఉన్న స్టిక్కర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ స్టిక్కర్ ఏమిటో తెలుసుకుందాం.
Key Points
రకుల్ ప్రీత్ సింగ్ మెడపై స్టిక్కర్ గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది.
అది లైఫ్‌వేవ్ ఎక్స్ 39 స్టెమ్ సెల్ ప్యాచ్ అని తెలిసింది.
ఈ ప్యాచ్ శరీరంలోని స్టెమ్ సెల్స్‌ను ఉత్తేజపరుస్తుంది.
చాలా మంది సెలబ్రిటీలు ఇటువంటి వెల్‌నెస్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు.
విమానాశ్రయంలో కనిపించిన రకుల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది . ఈ ఏడాది మేరీ హస్బెండ్ కీ బీవీ చిత్రంతో అభిమానులను మెప్పించింది . ప్రస్తుతం అజయ్ దేవగణ్ హీరోగా వస్తోన్న దేదే ప్యార్ దే -2 చిత్రంలో కనిపించనుంది . ఈ మూవీలో ఆర్ మాధవన్ , టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు . ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది .
మెడపై ఉన్న స్టిక్కర్ వైరల్
ఇక సినిమాల సంగతి పక్కనపెడితే రకుల్ ప్రీత్ సింగ్ తన ఫిట్ నెస్ కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తూ ఉంటోంది . జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ శ్రమిస్తూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది . ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ వహిస్తూ ఫుల్ గ్లామరస్ గా మెయింటెన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ . తన ఫిట్‌నెస్ రొటీన్, వ్యాయామ నియమావళికి సంబంధించిన స్నీక్ పీక్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది .
లైఫ్‌వేవ్ ఎక్స్ 39 ప్యాచ్ వివరాలు
అయితే ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ ముంబయి విమానాశ్రయంలో కనిపించింది . ఈ సందర్భంగా రకుల్ మెడపై ఉన్న ఓ ప్యాచ్ కెమెరాలకు చిక్కింది . ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఇంతకీ అదేంటా అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు . చివరికీ ఆ ఈ ప్యాచ్‌ను లైఫ్‌వేవ్ ఎక్స్ 39 స్టెమ్ సెల్ ప్యాచ్‌గా నెటిజన్స్ గుర్తించారు . ఇది మన శరీరంలోని స్టెమ్ సెల్స్ ఉత్తేజపరిచేందుకు రూపొందించిన వెల్‌నెస్ ప్రొడక్ట్ గా తేల్చేశారు. ఈ ప్యాచ్ ఎటువంటి మందులు లేకుండా శక్తిని , ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని తెలుస్తోంది . ప్రస్తుతం హెల్త్ కోసం చాలా మంది సెలబ్రిటీస్ వీటిని వినియోగిచండం ట్రెండ్ గా మారింది . వీటి ధర దాదాపు వేల రూపాయల్లోనే ఉండనుంది.
చివరగా, రకుల్ ప్రీత్ సింగ్ మెడపై ఉన్న స్టిక్కర్ లైఫ్ వేవ్ ఎక్స్ 39 స్టెమ్ సెల్ ప్యాచ్ అని తెలుసుకున్నాం. ఇది ఆరోగ్య సంరక్షణలో కొత్త ట్రెండ్ అనిపిస్తోంది.


