|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రకుల్ ప్రీత్ సింగ్‌కు మళ్లీ తెలుగులో అలాంటి సినిమా చేయాలట! ఆ డ్రీమ్ నెరవేరుతుందా?

Published: 19-12-2025, 12:04 AM
రకుల్ ప్రీత్ సింగ్‌కు మళ్లీ తెలుగులో అలాంటి సినిమా చేయాలట! ఆ డ్రీమ్ నెరవేరుతుందా?
  • రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి, పలువురు అగ్ర హీరోలతో నటించారు.
  • ప్రముఖ మేకప్ మాన్ చక్రి నూతన మేకప్ స్టూడియోను రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభించారు.
  • తాను తెలుగు సినిమాలను, తెలుగు వారిని ఎంతగానో మిస్ అవుతున్నానని రకుల్ ఈ సందర్భంగా తెలిపారు.
  • తెలుగులో ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని రకుల్ వ్యాఖ్యానించారు.

తెలుగు ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో టాలీవుడ్‌లోకి తిరిగి రానుందని సంకేతాలు ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో మాట్లాడుతూ, తాను తెలుగు సినిమాలను మిస్ అవుతున్నానని, ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని వెల్లడించారు.

రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ప్రస్థానం

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’(Venkatadhri Express) సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preeth Singh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అలా రామ్ చరణ్(Ram Charan), ఎన్టీఆర్(NTR), అల్లు అర్జున్(Allu Arjun), రవితేజ(Raviteja), మహేష్ బాబు(Mahesh Babu) వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది. ఇక ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘లక్ష్యం’, ‘సరైనోడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధ్రువ’ వంటి సూపర్ హిట్స్‌తో టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో నిలిచింది. అయితే ఈ మ‌ధ్య ర‌కుల్‌కి టాలీవుడ్‌లో అవ‌కాశాలు కరువ‌య్యాయి. దీంతో బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తుంది. ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే నిర్మాత జాకీ భగ్నానిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి భర్తతో మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్‌లకు వివిధ సినిమాలలో మేకప్ వేస్తూ వచ్చిన ప్రముఖ మేకప్ మాన్ కడాలి చక్రవర్తి(చక్రి) హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నూతనంగా “సెకండ్ స్కిన్ మేకప్ స్టూడియో & అకాడమీ” ప్రారంభించడం జరిగింది. గతంలో రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా వంటి ఎందరో స్టార్ హీరోయిన్లకు మేకప్ మెన్‌గా పనిచేసిన చక్రి తానే సొంతంగా ప్రారంభించిన ఈ నూతన మేకప్ స్టూడియోను ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన ప్రశ్నలకు రకుల్ ప్రీత్ సింగ్ సమాధానం ఇస్తూ… “ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు చేయకపోవడం వల్ల నేను తెలుగు సినిమాలను, తెలుగు వారిని ఎంతగానో మిస్ అవుతున్నాను.

మేకప్ స్టూడియో ప్రారంభోత్సవంలో రకుల్

తప్పకుండా నేను తెలుగులో సినిమాలు చేస్తాను. నాకు తొలి విజయం అందించింది తెలుగు సినిమానే. నన్ను తెలుగు ప్రజలు అంతగా ఆదరించారు. ఒక చక్కటి కథ కోసం ఎదురుచూస్తున్నాను. నాకు మంచి తెలుగు కథ రావాలని నా అభిమానులంతా నా కోసం ప్రార్థించండి. హైదరాబాద్‌లో ఉండి షూటింగ్ చేయాలని ఎంతో కోరికగా ఉంది. ప్రస్తుతం కథలు వింటున్నాను. మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాను. తెలుగులో బాహుబలి వంటి సినిమా చేయాలని నా కోరిక. అదే నా డ్రీమ్ అండ్ డ్రీమ్ రోల్ కూడా” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

తెలుగులో ‘బాహుబలి’ లాంటి సినిమా చేయాలనే కోరిక

A post shared by Rakul Singh (@rakulpreet)

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో ‘బాహుబలి’ లాంటి సినిమా చేయాలనే ఆకాంక్ష అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఆమె త్వరలోనే ఒక మంచి కథతో టాలీవుడ్‌కు తిరిగి వచ్చి, తన డ్రీమ్ రోల్‌ను సాధిస్తుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.