|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?

Published: 06-12-2025, 6:08 AM
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?
  • చిరంజీవి సలహా మేరకు మగధీర తర్వాత ‘జోష్’ చిత్రాన్ని రామ్ చరణ్ తిరస్కరించాడు.
  • కొరటాల శివ చెప్పిన ‘శ్రీమంతుడు’ కథను చరణ్ రిజెక్ట్ చేయగా, అది మహేష్ బాబుకి బ్లాక్ బస్టర్ అయింది.
  • అదే డైరెక్టర్‌తో ‘ఆచార్య’లో నటించి పెద్ద డిజాస్టర్‌ను ఎదుర్కొన్నాడు.
  • శంకర్ ‘గేమ్ ఛేంజర్’ మూవీతో నిర్మాతకు తీవ్ర నష్టాలు మిగిల్చాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో రెండు అతిపెద్ద తప్పులు చేశాడని కథనాలు వెల్లడిస్తున్నాయి. శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్‌ను వదులుకొని, ఆచార్య వంటి డిజాస్టర్‌ను ఎంచుకున్నాడు. ఈ కీలక నిర్ణయాల వెనుక ఉన్న కారణాలు, చిరంజీవి జోక్యం ఎందుకు ఫలించలేదో చూద్దాం.

రామ్ చరణ్ కెరీర్ ఎంపికలు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ కెరీర్ బిగినింగ్ నుంచి తన కథల ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో రాంచరణ్ కొన్ని చెత్త కథలని ఎంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి.. రాంచరణ్ సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకునేవారు. మగధీర తర్వాత రాంచరణ్ వద్దకు నిర్మాత దిల్ రాజు జోష్ కథని తీసుకువచ్చారు.

మగధీర తర్వాత చరణ్ ఇలాంటి చిత్రం చేయడం కరెక్ట్ కాదని చిరంజీవి వద్దని చెప్పారు. దీనితో ఆ మూవీ నాగ చైతన్య చేతుల్లోకి వెళ్ళింది. జోష్ నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అయితే రాంచరణ్ తన కెరీర్ లో చేసిన అతిపెద్ద కాస్ట్లీ మిస్టేక్స్ 2 ఉన్నాయి. అందులో మొదటిది శ్రీమంతుడు చిత్రాన్ని రిజెక్ట్ చేయడం.

శ్రీమంతుడు మిస్: అతిపెద్ద తప్పు

డైరెక్టర్ కొరటాల శివ శ్రీమంతుడు కథని ముందుగా రాంచరణ్ కి వివరించారు. అయితే చరణ్ కథలో కొన్ని మార్పులు సూచించారట. ఆ మార్పులు చేస్తుంటే కథ వర్కౌట్ కావడం లేదని చరణ్ శ్రీమంతుడు కథని పక్కన పెట్టేశారు. కొరటాల శివ అదే కథని మహేష్ బాబుతో తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. శ్రీమంతుడు చిత్రం ఏకంగా 140 కోట్లకి పైగా గ్రాస్ రాబట్టి నాన్ బాహుబలి హిట్ గా నిలిచింది.

రాంచరణ్ RRR తర్వాత ఆచార్య చిత్రంలో కీలక పాత్రలో నటించారు. కొరటాల శివ చెప్పిన శ్రీమంతుడు లాంటి అద్భుతమైన కథని రిజెక్ట్ చేసిన చరణ్.. అదే డైరెక్టర్ తీసుకువచ్చిన ఆచార్య లాంటి చెత్త కథని ఓకె చేశారు. చిరంజీవి కూడా ఆచార్య కథని బ్లైండ్ గా నమ్మేసినట్లు ఉన్నారు. అందుకే చిరంజీవి కూడా ఏమీ చేయలేకపోయారు.

ఆచార్య, గేమ్ ఛేంజర్: చిరంజీవి జోక్యం

ఫలితంగా ఆచార్య చిరంజీవి, రాంచరణ్ ఇద్దరికీ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత కూడా రాంచరణ్ మరో మిస్టేక్ చేశారు. డైరెక్టర్ శంకర్ ని గుడ్డిగా నమ్మేసి గేమ్ ఛేంజర్ మూవీ చేశారు. శంకర్ నాన్చుతూ తీసిన గేమ్ ఛేంజర్ ఊహించని డిజాస్టర్ గా మారింది. నిర్మాత దిల్ రాజుకి తీవ్ర నష్టాలు మిగిల్చింది.

మొత్తంగా, రామ్ చరణ్ కెరీర్ ప్రారంభం నుండి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, శ్రీమంతుడు వంటి అవకాశాలను కోల్పోయి, ఆచార్య వంటి చిత్రాలతో భారీ నష్టాలను చవిచూశాడు. చిరంజీవి కూడా ఈ తప్పులను అడ్డుకోలేకపోవడం గమనార్హం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.