|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎట్టకేలకు ప్రియుడితో పెళ్లి పీటలెక్కిన రామ్ చరణ్ ‘ఆరెంజ్’ బ్యూటీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

Published: 07-06-2025, 1:26 AM
ఎట్టకేలకు ప్రియుడితో పెళ్లి పీటలెక్కిన రామ్ చరణ్ ‘ఆరెంజ్’ బ్యూటీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

తెలుగు సినీ పరిశ్రమలో ఒకే సినిమాతో పేరు తెచ్చుకున్న షాజన్ పదంసీ, తాజాగా తన ప్రియుడితో వివాహం చేసుకుంది. రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’ సినిమాలో ఆమె నటన ప్రేక్షకులను మెప్పించింది.

Key Points

1

రామ్ చరణ్ 'ఆరెంజ్' సినిమా నటి షాజన్ పదంసీ వివాహం.

2

ఒక బిజినెస్‌మ్యాన్‌తో గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది.

4

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేస్తూ విషయం అఫీషియల్‌గా ప్రకటించారు.

‘ఆరెంజ్’ సినిమా నటి వివాహం

ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్స్ ఒకే ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‌‌గా మారిపోతారు. అయితే అప్పటి వరకు బాగానే ఉన్నా సడెన్‌గా మరో చిత్రం చేయకుండా ఇండస్ట్రీకి దూరం అవుతారు. అలా ఒకే ఒక్క మూవీతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిన ఈ హీరోయిన్ ఇప్పుడు సైలెంట్‌గా పెళ్లి పీటలెక్కింది. మరి ఆమె ఎవరో కాదండోయ్ హీరోయిన్ షాజన్ పదంసీ(Shajan Padamsi). బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ప్రేమ కథా చిత్రం ‘ఆరెంజ్’(Orange).

గ్రాండ్‌గా జరిగిన వివాహ వేడుక

అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ఇందులోని పాటలు ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచాయి. ఇక ఇందులో మెయిన్ హీరోయిన్‌గా జెనీలియా(Genelia) నటించగా, ప్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ ప్రియురాలు రూబాగా షాజన్ పదంసీ నటించింది. అయితే సినిమాలో ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో కుర్రకారును కవ్వించింది. తర్వాత ‘మసాలా’(Masala) సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు.

నెటిజన్ల శుభాకాంక్షలు

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుంది. గ్రాండ్‌గా ఓ బిజినెస్‪‌మ్యాన్‌తో ఏడడుగులు వేసింది. మూవీ మాక్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియాతో ఈ ఏడాది జనవరిలో రోకా వేడుక అట్టహాసంగా జరిగింది. తాజాగా వీరి వివాహం కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. ఇక ఈ విషయాన్ని ఈ జంట అఫీషియల్‌గా ప్రకటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోస్ షేర్ చేశారు. అయితే ఈ ఫొటోస్‌కు ‘ఈ రోజు.. ఈ అనుభూతి.. మాది ఎప్పటికీ అనంతం&లవ్’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ పిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

షాజన్ పదంసీ వివాహ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆమె భవిష్యత్తుకు శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.