|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రామ్ చరణ్, బన్నీ ప్రైవేట్ జెట్ ల ఖరీదు తెలిస్తే మైండ్ బ్లాక్!

Published: 10-04-2026, 1:35 AM
షాకింగ్: రామ్ చరణ్, బన్నీ ప్రైవేట్ జెట్ ల ఖరీదు తెలిస్తే మైండ్ బ్లాక్!
  • ప్రైవేట్ జెట్: రామ్ చరణ్, అల్లు అర్జున్ లగ్జరీ లైఫ్ స్టైల్ వెనుక భారీ వ్యయం!
  • ఒక్కో ప్రైవేట్ జెట్ ఖరీదు అక్షరాలా 70 కోట్లు! దిమ్మతిరిగే విషయం!
  • నెలకి 75 లక్షల EMI కట్టాలంటే మామూలు విషయం కాదుగా!
  • పైలెట్లు, సిబ్బంది జీతాలు, మెయింటెనెన్స్ ఖర్చులు కలిపితే ఏడాదికి కోటిన్నర పైమాటే!

టాలీవుడ్ హీరోల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలని ఉందా? రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు వాడుతున్న ప్రైవేట్ జెట్ ల గురించి కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రైవేట్ జెట్ అంటే ఎంత ఖరీదో తెలుసా?

రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున, నయనతార, ప్రభాస్ ఇలా ఎంతో మందికి సొంత ప్రైవేట్ జెట్ విమానాలు ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లీ, ముఖేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్.. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు విలాసవంతమైన ప్రైవేటు జెట్ విమానాలను కలిగి ఉన్నారు. అయితే ఆ ప్రైవేట్ జెట్ విమానాలను చూసినప్పుడు సామాన్యులకు ఎన్నో సందేహాలు వస్తాయి. అది ఎంత ఖరీదు ఉంటుంది? ఎంత సంవత్సరానికి సంపాదిస్తే ప్రైవేట్ విమానం కొనగలం? ఈఎంఐ పద్ధతిలో కొంటె నెలకు ఎంత మొత్తాన్ని కట్టాలి? వంటి అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలన్నిటికీ జవాబులు ఇక్కడే ఉన్నాయి.. మీకు ఆసక్తి ఉంటే తెలుసుకోండి.

భారతదేశంలో ఎంతోమంది సెలబ్రిటీలు, బడా పారిశ్రామికవేత్తలు సొంత ప్రైవేట్ జెట్ విమానాలలో ప్రయాణించడం మనం చూస్తూనే ఉంటాము. ఒక సొంత ప్రైవేట్ జెట్ విమానం కొనాలంటే దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. అయితే ఇది కేవలం ఆ విమానం ధర మాత్రమే. విదేశాల నుండి దీన్ని మన దేశానికి రప్పించడానికి రిజిస్ట్రేషన్ కు భారీగా ఖర్చు చేయాలి. ఇక జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ వంటి పన్నులు కూడా కలిపితే అదనంగా 20 కోట్ల నుంచి 22 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతాయి. అంటే ఒక ప్రైవేట్ జెట్ మన దేశానికి వచ్చేసరికి 70 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు అవుతుంది.

నెలకి ఎంత ఈఎంఐ కట్టాలో తెలుసా?

సాధారణంగా 70 కోట్ల రూపాయలకు పైగా సంపాదన ఉన్నవారే ఈ ప్రైవేటు జెట్ విమానాలను కొంటారు. ఒకేసారి డబ్బులు ఇచ్చి కొనేసే బిలియనీర్లే ఎక్కువ. ఒకవేళ ఈఎమ్ఐ రూపంలో కొంటె మాత్రం లోన్ పెట్టుకోవచ్చు. అయితే నెలకు ఈఎమ్ఐ కూడా భారీగానే ఉంటుంది. ఉదాహరణకు 10 కోట్లు డౌన్ పేమెంట్ గా ఇస్తే మిగతా 40 కోట్లు లోన్ రూపంలో బ్యాంకుల నుంచి తీసుకోవాలి. ఇందుకోసం బ్యాంకులు తొమ్మిది నుంచి 11 శాతం వడ్డీని తీసుకుంటాయి. ఏడేళ్ల కాలపరిమితితో లోన్ తీసుకుంటే ఏడాదికి ఎనిమిదన్నర కోట్ల నుంచి తొమ్మిది కోట్ల రూపాయల వరకు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. అంటే నెలకి 75 లక్షల రూపాయలు ఈఎంఐగా చెల్లించాలి.

మెయింటెనెన్స్ ఖర్చు వింటే షాక్ అవుతారు!

విమానం కొనడంతోనే సరిపోదు.. దాని నిర్వహణకు కూడా భారీగానే ఖర్చవుతుంది. విమానానికి ఇద్దరు పైలెట్లు, కనీసం ఒక సిబ్బంది అవసరం. వీరి జీతాలకు ఏడాదికి ఒక కోటి నుంచి కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టాలి. అలాగే విమానాన్ని పార్కు చేయడానికి, ఇన్సూరెన్స్ చేయడానికి కోటి రూపాయలు దాకా ఖర్చవుతుంది. ఇక విమానం కండిషన్లో ఉండేందుకు చేసే మరమ్మతులు, సాఫ్ట్ వేర్ అప్డేట్స్ కోసం ప్రతి ఏడాది 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఇక విమానాన్ని వాడారంటే ప్రతి గంటకు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ వంటి ఇంధనానికి, లాండింగ్ చార్జీల కోసం రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. అంటే ఈ ప్రైవేటు జెట్ విమానం నిర్వహణ కోసమే ఏడాదికి 16 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది. అందుకే కేవలం బిలియనీర్లు మాత్రమే ప్రైవేటు విమానాలను కొంటూ ఉంటారు. ఏడాదికి 60 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయలు సంపాదించే వారే ఇలా విమానాలను కొనగలరు.

ప్రైవేట్ జెట్ ల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు కదా. రామ్ చరణ్, అల్లు అర్జున్ ల విలాసవంతమైన జీవితం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.