
📌 Key Points
- రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
- ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించగా ఆమె నో చెప్పింది.
- ప్రస్తుతం మిస్ ఇండియా మానస వారణాసిని తీసుకునే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.
- సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉంది. జూన్ చివరి వారంలో విడుదల కావొచ్చు.
రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ ని సంప్రదించగా ఆమె నో చెప్పడంతో మిస్ ఇండియా మానస వారణాసిని సంప్రదిస్తున్నట్లు సమాచారం.
బుచ్చిబాబు సినిమాలో ఐటెం సాంగ్ కోసం వేట
Peddi Movie: పెద్ది … ఈ మధ్య కాలంలో ఈ సినిమా క్రియేట్ చేసిన బజ్ మరే సినిమా క్రియేట్ చేయలేదంటే ఆశ్చర్యం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ మరియు వృద్ధి సినిమాస్ కలిసి దాదాపు ౩౦౦ కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ జత కట్టగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాపై చరణ్ పెట్టుకున్న హోప్స్ అన్నీ ఇన్నీ కావు.ఎందుకంటే గత పొంగల్ బరిలో దిగిన గేమ్ ఛేంజర్ బొక్క బోర్లా పడటంతో ఈ సినిమాతో అయినా సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశ పడి మరీ ఎంచుకున్న కథ కాబట్టి.
కొంచెం టాకీ పార్ట్ తో పాటు స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్
ఇక సినిమాని మార్చి 27న రిలీజ్ చేస్తామని సినిమా మొదలైనప్పుడే చెప్పేసింది మూవీ టీమ్. కానీ కారణాలేవైనా ఈసారి పక్కా అంటూ ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. అయితే ఏప్రిల్‌లో కాదు కదా, మే నెలలో కూడా సినిమా రావడం అనుమానమే అన్నవార్త ఇపుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంకా కొంచెం టాకీ పార్ట్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉండటంతో జూన్ చివరి వారం వరకు వెళ్ళినా ఆశ్చర్యం లేదని ఇన్ సైడ్ టాక్.అయితే ఇప్పటికీ మేకర్స్ నుండి ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో ఇదీ అని క్లారిటి గా చెప్పలేని పరిస్థితి.
మృణాల్ ఠాకూర్ నో చెప్పడానికి కారణం ఏంటి?
మొహం మీదే ‘నో’ చెప్పేసిన మృణాల్?
ఇకపోతే సినిమాలో బ్యాలెన్స్ ఉన్న ఆ ఐటెం సాంగ్ ఎవరు చేస్తారా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే ‘రంగస్థలం’లో‘జిగేల్ రాణి’గా మ్యాజిక్ చేసిన మృణాల్ ఠాకూర్ ని రిపీట్ చేయాలని బుచ్చి ట్రై చేయడం,ఆమె మొహం మీదే ‘నో’ చెప్పేయడం చక చక జరిగిపోయాయట.మొత్తానికి ఐటెం అదే స్పెషల్ సాంగ్స్ గనుక కంటిన్యూ చేస్తే మెయిన్ లీడ్ అవకాశాలు రావా లేక డేట్స్ లేక నో చెప్పిందా తెలీదు కాని సాలిడ్ రేట్ ఆఫర్ చేసినా మృణాల్ లైట్ తీసుకోవడంతో ఆ పాటకి స్టెప్పులు వేసే అమ్మడు ఎవరా అంటూ డైలమాలో పడిపోయిందట మూవీ యూనిట్
మిస్ ఇండియా బ్యూటీ మానస వారణాసి
అయితే తాజాగా ఆ ప్లేస్‌లోకి మిస్ ఇండియా బ్యూటీ మానస వారణాసి ని తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. రీసెంట్‌గా సంతోష్ శోభన్ తో‘కపుల్ ఫ్రెండ్లీ’అంటూ హిట్టు కొట్టిన ఈ భామ మంచిమార్కులే కొట్టేసింది కాని,గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ లో ఉన్న గ్రేస్ ని మ్యాచ్ చేయగలదా అన్నదే మెగా ఫ్యాన్స్ ని వేధిస్తున్న ప్రశ్న.ఇదిలా ఉంటె క సినిమా డైరెక్టర్స్ తెరకెక్కించే సినిమాలో కూడా సాయి దుర్గ తేజ్ పక్కన మానస వారణాసినే ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తుంది.చూడాలి నిజమెంతో.
మిస్ ఇండియా మానస వారణాసికి ఛాన్స్?
రాబోయే ఐటెం సాంగ్ మీదనే అంచనాలు
ఇక ఇదిలా ఉంటె ఆస్కార్ విన్నర్ రెహమాన్ మ్యూజిక్ చేసే మ్యాజిక్ మాములుగా ఉండదు.కాని ఈ సినిమాలో చికిరి చికిరి తర్వాత దాన్ని బీట్ చేసేలా రై రై రారా లేదన్నది నిజం.దీంతో ఇప్పుడు రాబోయే ఐటెం సాంగ్ మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇది గనుక క్లిక్ అవకపోతే మాత్రం సినిమా రేంజ్ పడిపోవడం ఖాయమన్నది కొందరు ఫ్యాన్స్ నుండి వినిపిస్తున్న మాట.ఏదేమైనా ఏప్రిల్ లో అయినా వస్తుందని ఆశ పెట్టుకున్న ఫ్యాన్స్ కి పోస్ట్ పోన్ అయితే మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
చూడాలి మరి బ్యాలెన్స్ ఉన్న ఈ స్పెషల్ సాంగ్ ని చక చక పూర్తి చేసి కనీసం జూన్ లో అయినా రిలీజ్ చేస్తారో లేక మరిన్ని వాయిదాల పాటలు పాడుతారో !
మొత్తానికి రామ్ చరణ్ సినిమా కోసం ఐటెం సాంగ్ చేసేది ఎవరు అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మానస వారణాసి వస్తే ఎలా ఉంటుందో చూడాలి. సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


