
📌 Key Points
- రామ్ చరణ్ ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది.
- తెలుగులో కేవలం 40 రోజుల్లో 100 మిలియన్ వ్యూస్ రికార్డు సాధించింది.
- అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ల వ్యూస్ మార్కును దాటింది.
- ‘పెద్ది’ మూవీలోని ఈ పాట ఆల్ టైమ్ బెస్ట్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తోంది.
రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీలోని ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది. కేవలం 40 రోజుల్లోనే తెలుగులో 100 మిలియన్ వ్యూస్ మార్కును దాటి, అరుదైన మైల్‌స్టోన్‌ను అందుకుంది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
యూట్యూబ్‌లో చికిరి చికిరి రికార్డుల పరంపర
యూట్యూబ్‌లో రామ్ చరణ్ పెద్ది మూవీలోని చికిరి చికిరి సాంగ్ రికార్డులు తిరగరాస్తోంది. తాజాగా తెలుగులో 100 మిలియన్ల వ్యూస్ రికార్డు అందుకోవడం విశేషం. ఇక ఓవరాల్‌గా అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న పెద్ది మూవీలోని చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్‌లో సంచలనాల పరంపర కొనసాగిస్తోంది. గత నెల 7వ తేదీన ఈ పాటను మేకర్స్ రిలీజ్ చేయగా.. 40 రోజుల్లోనే అరుదైన 100 మిలియన్ల మార్క్ అందుకోవడం విశేషం. తెలుగులో ఆల్ టైమ్ బెస్ట్ చార్ట్‌బస్టర్ గా రికార్డు క్రియేట్ చేసే దిశగా దూసుకెళ్తోంది.
చికిరి చికిరి సాంగ్ రికార్డు
“చికిరి చికిరికి సెంచరీ. ఈ ప్రేమకు రుణపడి ఉంటాం. తెలుగులో 100 మిలియన్ ప్లస్, మొత్తం 5 భాషల్లో కలిపి 150 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటను సీజన్ ఆంథమ్ గా మార్చినందుకు థ్యాంక్యూ. రీల్స్ ఇంకా రావాలి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
చికిరి చికిరి సాంగ్ లిరిక్స్ ఇవే..
ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంత ఆడిందే తైతక్కా…
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను సూసి మీసం లేచి ఏసే కేక
చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక
ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా..
తెలుగులో 100 మిలియన్ల వ్యూస్ మైల్‌స్టోన్
చికిరి చికిరి ఆడంగుల మచ్చయిందిలా
ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
ఏం బోక్కావో అందాలు, ఒళ్ళంతా వంకీలు
నీ మత్తే తాగిందా తాటికల్లు..
నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…
తర్ రంధనాననా తర్ రంధనానా..
తర్ రంధనాననా నా నా నా నా…
రామ్ చరణ్ – జాన్వీ జోడీకి ఫ్యాన్స్ ఫిదా
నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి
లొట్టెసి ఊరాయి నోట నీళ్లు..
నీ సింగారాన్ని సూత్తావుంటే సొంగకార్చుకుందే
గుండె బెంగ నిదరని మింగేసిందే చెయ్యలేసే చెయ్యలేసే..
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
నా గుండెల్లో పోత్తాందే ఉక్క…
పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
సరుకు సామాను సూసి మీసం లేచి వేసే కేక
చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక
‘చికిరి చికిరి’ పాట సాధించిన ఈ అరుదైన విజయం రామ్ చరణ్ స్టార్‌డమ్, సంగీత దర్శకుల ప్రతిభకు నిదర్శనం. భవిష్యత్తులో ఈ పాట ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి. ఇది నిజంగా సినీ ప్రియులకు ఒక అద్భుతమైన ట్రీట్.


