|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ ఢిల్లీ షెడ్యూల్ పూర్తి: గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాల చిత్రీకరణ!

Published: 25-12-2025, 6:52 PM
రామ్ చరణ్ 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్ పూర్తి: గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశాల చిత్రీకరణ!
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో ‘పెద్ది’ తెరకెక్కుతోంది.
  • ఢిల్లీలో అత్యంత కీలకమైన, గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యింది.
  • జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
  • ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘చికిరి చికిరి’ పాట దేశవ్యాప్తంగా 100 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ మూవీ ఢిల్లీ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాల చిత్రీకరణ విశేషాలు వెలువడ్డాయి. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా విశేషాలపై ఒక లుక్కేద్దాం.

ఢిల్లీ షెడ్యూల్ పూర్తి: ఉత్కంఠభరిత సన్నివేశాలు

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై దాదాపు 350 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాంచరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇటీవల ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన చికిరి చికిరి అనే సాంగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. రాంచరణ్ స్టెప్పులపై కొన్ని వేల రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతలా ఈ పాట ఆడియన్స్ కి నచ్చేసింది.

ఇటీవల చిత్ర యూనిట్ అత్యంత కీలకమైన షెడ్యూల్ కోసం ఢిల్లీ వెళ్లారు. రత్నవేలు ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎర్రకోట వద్ద అత్యంత కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా చిత్ర యూనిట్ ఢిల్లీ షెడ్యూల్ పూర్తి అయినట్లు ప్రకటించింది.

‘పెద్ది’ భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్ వివరాలు

అందుతున్న సమాచారం మేరకు ఢిల్లీ షెడ్యూల్ లో డైరెక్టర్ బుచ్చిబాబు గూస్ బంప్స్ తెప్పించే కొన్ని సన్నివేశాలని చిత్రీకరించారట. ఈ మేరకు డైరెక్టర్ బుచ్చిబాబు, రత్నవేలు మంచులో కూడా షూటింగ్ చేస్తున్న దృశ్యాలని పోస్ట్ చేశారు.

ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో రూరల్ డ్రామాగా తెరకెక్కుతోంది. రంగస్థలం తర్వాత అంతకన్నా మంచి గుర్తింపు, విజయం ఈ చిత్రంతో దక్కుతుందని రాంచరణ్ ముందు నుంచి నమ్మకంతో ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.

‘చికిరి చికిరి’ పాట సంచలనం, రిలీజ్ డేట్

#Peddi wraps up a key schedule in Delhi with immersive, poetic visuals 💥💥 A few superb sequences were shot in this schedule ❤‍🔥 #PEDDI WORLDWIDE RELEASE ON 27th MARCH, 2026. Mega Power Star @AlwaysRamCharan @NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @arrahman … pic.twitter.com/n1AJ72pCRI

— Vriddhi Cinemas (@vriddhicinemas) December 25, 2025

రామ్ చరణ్ ‘పెద్ది’ ఢిల్లీ షెడ్యూల్ విజయవంతం అవడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానున్న ఈ స్పోర్ట్స్ రూరల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.