
📌 Key Points
- బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కావాల్సి ఉంది.
- ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఎంపికపై చరణ్ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.
- పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోయిన్ కావాలని చరణ్ భావిస్తున్నారట.
- మృణాళ్ ఠాకూర్ తప్పుకోవడంతో మానస వారణాసి పేరు పరిశీలనలో ఉంది.
రామ్ చరణ్, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడింది. ఐటమ్ సాంగ్ కోసం హీరోయిన్ ఎంపిక విషయంలో చరణ్ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పెద్ది సినిమా విడుదల ఎప్పుడు?
Ramcharan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan)ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో పెద్ది సినిమా(Peddi Movie) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు భావించారు కానీ అనుకున్న విధంగా 30వ తేదీ విడుదల కావడం లేదని తెలుస్తుంది .ఇంకా ఈ సినిమాలో ఒక సాంగ్ షూటింగ్ కావాల్సి ఉంది అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ప్రమోషన్ల కోసం మరింత సమయం అవసరమవుతున్న నేపథ్యంలో సినిమా వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం రామ్ చరణ్ అంటూ ఒక వార్తా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తికాగా, ఒక ఐటమ్ సాంగ్ మాత్రమే షూట్ చేయాల్సి ఉంది. ఐటమ్ సాంగ్ విషయంలో హీరోయిన్ల ఎంపిక విషయంలో రామ్ చరణ్ అసంతృప్తిగా ఉన్నారట అందుకే ఈ సాంగ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఐటమ్ సాంగ్ చేసే హీరోయిన్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ఆదరణ కలిగిన ఉన్న హీరోయిన్ అయితే బాగుంటుందని చరణ్ భావిస్తున్నారట. ఇక చిత్ర నిర్మాతలు మాత్రం ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం దక్షిణాదికి చెందిన ఒక హీరోయిన్ ను ఎంపిక చేయడంతో చరణ్ హీరోయిన్ విషయంలో హ్యాపీగా లేరని అందుకే సాంగ్ షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తోంది.
ఐటమ్ సాంగ్ పై చరణ్ అసంతృప్తి?
చరణ్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోయిన్ ను తీసుకోవాలని సూచనలు చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఏ హీరోయిన్ ను రంగంలోకి దింపబోతున్నారనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్స్ చేయబోతున్నారు అంటూ ఎంతో మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి అయితే నటి మృణాళ్ ఠాకూర్(Mrunal Thakur) పేరు కాస్త బలంగా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా స్పెషల్ సాంగ్ నుంచి మృణాళ్ తప్పుకున్నారని ఆమె స్థానంలో మానస వారణాసి నటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం ఏ హీరోయిన్ ను ఫైనల్ చేయలేదని తెలుస్తుంది.
గ్రామీణ క్రీడా నేపథ్యంలో పెద్ది..
హీరోయిన్ మార్పుకు కారణం ఇదేనా?
ఇక ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే .ఇందులో చరణ్ క్రికెట్ తో పాటు కుస్తీ పోటీలలో కూడా కనిపించబోతున్నారని ఇటీవల విడుదల చేసిన ఒక గ్లింప్స్ చూస్తూనే తెలుస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటించిన సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో సీనియర్ నటులు జగపతిబాబు, సాయికుమార్, శివ రాజ్ కుమార్ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.
మొత్తానికి, ‘పెద్ది’ సినిమా విడుదల వాయిదా పడటానికి ఐటమ్ సాంగ్ హీరోయిన్ ఎంపిక ఒక కారణమని తెలుస్తోంది. చిత్ర బృందం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.


