|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’: తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్? గ్లింప్స్‌తో సంచలనం!

Published: 28-03-2026, 7:05 AM
రామ్ చరణ్ 'పెద్ది': తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్? గ్లింప్స్‌తో సంచలనం!
  • రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది, ఏప్రిల్ 30న విడుదల కానుంది.
  • రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌లో ద్విపాత్రాభినయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
  • ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
  • పెద్ది సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో, పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. రామ్ చరణ్ పుట్టినరోజు నాడు విడుదలైన గ్లింప్స్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఏప్రిల్ 30న ‘పెద్ది’ విడుదల: షూటింగ్ పూర్తి!

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో పెద్ది సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరొక వారం రోజులలో షూటింగ్ పనులను పూర్తి చేసుకోబోతోందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఒకవైపు షూటింగ్ జరుపుకుంటూ ఉండగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు కూడా పూర్తి అవుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని అప్డేట్స్ విడుదల చేయగా ఈ అప్డేట్స్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. మార్చి 27వ తేదీ రామ్ చరణ్(Ramcharan) పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి పహిల్వాన్ గ్లింప్స్ (pehelwan glimpse )అంటూ ఒక వీడియోని విడుదల చేయగా ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సినిమా పట్ల భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఈ విషయంపై విభిన్న రీతిలో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు అంటూ సందేహ పడుతున్నారు.

రామ్ చరణ్ ద్విపాత్రాభినయమా? అభిమానుల్లో సందేహాలు!

ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ లో రామ్ చరణ్ చెవికి, ముక్కుకు పోగుతో కనిపించారు. అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పహిల్వాన్ గ్లింప్స్ లో చరణ్ కు చెవి ముక్కుకు పోగు లేకపోవడంతో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తూ ఇందులో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారా? తండ్రి కొడుకులుగా నటిస్తున్నారా? అంటూ సందేహ పడుతున్నారు. మరి ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారనేదిన తెలియాలి అంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా జాన్వీ కపూర్ నటించబోతున్న సంగతి తెలిసిందే.

అంచనాలు పెంచిన అప్డేట్స్..

‘పెద్ది’లో జాన్వీ కపూర్.. అంచనాలు పెంచేస్తున్న సినిమా!

ఈ సినిమా గ్రామీణ క్రీడా నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇందులో క్రికెట్ మాత్రమే కాకుండా కుస్తీ కూడా ఉండబోతుందని తాజాగా విడుదల చేసిన వీడియో చూస్తేనే స్పష్టం అవుతుంది. ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు కూడా అప్పలసూరి అనే పాత్రలో కనిపించబోతున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎలాంటి విజయాలను అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదల చేసిన పాటలు కూడా సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి.

మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.