
📌 Key Points
- రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది.
- సినిమా రన్ టైం లాక్ అయిందని యూనిట్ తెలిపింది.
- ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూలర్ డ్రామాగా ఉండబోతుంది.
- దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ ను కొత్తగా చూపిస్తున్నారని సమాచారం.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది. మూవీ రన్ టైం లాక్ అయిందని సమాచారం. ఏప్రిల్ 30న సినిమా విడుదల కానుంది.
‘పెద్ది’ మూవీ రన్ టైం వివరాలు
Peddi Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉందన్న విషయం తెలిసిందే.. ఈ చిత్రం నుంచి తాజాగా రిలీజ్ అయిన సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.. రామ్ చరణ్ గతంలో నటించిన గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను అందుకోవడంతో ఇప్పుడు రాబోతున్న పెద్ది మూవీ పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఏప్రిల్ 30 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం రన్ టైం ను లాక్ చేసుకుంది. ఎన్ని గంటల సమయంను లాక్ చేసుకుందో చూద్దాం..
తెలుగులో ఈ మధ్య 3 గంటల నిడివితో మూవీలు వస్తున్నాయి.. బాలీవుడ్ లో గతంలో వచ్చిన యానిమల్ మూవీ వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ప్రస్తుతం దురంధర్ 2 మూవీ కూడా భారీ రన్ టైం టైంతో రాబోతుంది. ఇదే క్రమంలో పెద్ది కూడా భారీ రన్‌టైమ్‌తో వస్తోందనే ప్రచారం మొదలైంది.. మూవీ దాదాపు నాలుగు గంటల వరకు ఉండబోతుందని తెలుస్తుంది. ఫైనల్ రన్‌టైమ్ 3 గంటలకు పైగా ఉంటుందనే కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై పెద్ది యూనిట్ స్పందించింది.. ఇప్పటివరకు ఈ మూవీ మొదటి భాగం రన్ టైం మాత్రమే లాక్ అయిందని, రెండో భాగం ఇంకా షూటింగ్ దశలోనే ఉందని తెలిపారు.. త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేయనున్నట్లు సమాచారం. దీనిపై అతి త్వరలోనే ఓ ప్రకటన రాబోతుందని తెలుస్తుంది.
ఫ్యాన్స్ అంచనాలు, విడుదల తేదీ
సినిమాపై దర్శకుడు బుచ్చిబాబు కామెంట్స్
స్టార్ హీరో అందరికీ ఒకే ఇమేజ్ రావాలని రూల్ లేదు.. పెద్ద సినిమాలలో స్టార్ లో ఉండడం కామన్. అంటే అన్ని సినిమాలు హిట్ అవుతున్నాయని చెప్పలేను.. గతంలో వచ్చిన రామ్ చరణ్ గేమ్ చేజర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ నిరాశ పరిచింది. పెద్ది మూవీ మొదలైనప్పటి నుంచి పాజిటివ్ బజ్ నెలకొంది. గ్లింప్స్, చిరికి పాట… ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి.. ఇప్పుడు రిలీజ్ అయిన రై రై పాట కు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఇలాంటి వెరైటీలు ఇంకా ఉన్నాయి. వాటిని ఒకొక్కటిగా రివీల్ చేయబోతున్నాట.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చుట్టూ నడిచే రూలర్ డ్రామా. స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఒకటే అనుకొనేరు.. మొత్తానికి రామ్ చరణ్ ను డైరెక్టర్ బుచ్చిబాబు కొత్తగా చూపించాడు. దాంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి..
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ రూలర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

