
📌 Key Points
- రామ్ చరణ్, బుచ్చిబాబు సన దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తోంది.
- జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.
- ఈ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటకు రామ్ చరణ్ స్టెప్పులు యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
- తెలంగాణ హైకోర్టు తీర్పుతో సినిమా విడుదల తేదీ ఏప్రిల్ 30కి వాయిదా పడింది.
రామ్ చరణ్, బుచ్చిబాబు సన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుందని సమాచారం. ఈ నేపథ్యంలో విడుదల తేదీ సెంటిమెంట్ రామ్ చరణ్ కు కలిసొస్తుందా అనేది చూడాలి.
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ విశేషాలు
Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ.. తన స్టేటస్ కి తగ్గట్టుగా సక్సెస్ అందుకోవాలని పరితపిస్తున్నారు. అందులో భాగంగానే ఉప్పెన (Uppena) సినిమాతో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇప్పటికి ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్ , పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పైగా ఈ సినిమా నుంచి వచ్చిన “చికిరి చికిరి” సాంగ్ తో పాటు అందులో రామ్ చరణ్ హుక్ స్టెప్పు కూడా విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పైగా ఈ పాట యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది..
ఇక ఈ సినిమాను మొదట మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ అటు తెలంగాణలో టికెట్ ధరలు పెంచుకోవాలి అంటే మూడు నెలల ముందే అనుమతి తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు తీర్పునివ్వడంతో ఆ విడుదల తేదీని కాస్త వాయిదా వేశారు. అలా ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఒకవేళ ఈ డేట్ లో కచ్చితంగా ఈ సినిమా వచ్చిందంటే మాత్రం ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందా? ఆ హిస్టరీ రిపీట్ చేస్తుందా? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
‘చికిరి చికిరి’ సాంగ్ సెన్సేషన్
అసలు విషయంలోకి వెళ్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి(Chiranjeevi ) వారసుడిగా ఇండస్ట్రీలోకి ‘చిరుత’ సినిమాతో అడుగు పెట్టారు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా చిరంజీవి వారసుడు అన్న కారణంతోనే ఈ సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చాయి పైగా ఉత్తమ నటుడు విభాగంలో రాంచరణ్ కి అవార్డు కూడా లభించింది. నిజానికి ఈ సినిమాలో ఆయన నటన ప్రేక్షకులను మెప్పించకపోవడంతో అసలు నటుడిలా లేడు అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత తనను తాను మార్చుకొని రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో హిస్టారికల్ మూవీ ‘మగధీర’ సినిమా చేసి సంచలనం సృష్టించారు. ఒక్క సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ సినిమా జూలై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తర్వాత రామ్ చరణ్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘రంగస్థలం’ ఈ సినిమా కూడా మార్చి 30వ తేదీన విడుదలై మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని రామ్ చరణ్ కు అందించింది. అయితే ఇప్పుడు పెద్ద సినిమా కూడా ఏప్రిల్ 30వ తేదీన విడుదల కాబోతోంది. అలా మొత్తానికైతే ఇదే డేటున సినిమా వచ్చి విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది అంటే మాత్రం 30 అనే ఒక తేదీ రాంచరణ్ కు బాగా కలిసి వస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికైతే ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవ్వాలని, హిస్టరీ రిపీట్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.
విడుదల తేదీ సెంటిమెంట్ ఫలిస్తుందా?
also read: Tollywood: కుర్రహీరో మూవీ కోసం బడా నిర్మాతలు పోటీ.. ఆ క్రేజ్ ఏంటి సామీ!
మొత్తానికి రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఇదే తేదీ ఖరారైతే, గతంలో కలిసొచ్చిన సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా వర్కౌట్ అవుతుందో లేదో వేచి చూడాలి.


