
📌 Key Points
- రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా వీడియోలు వైరల్!
- వీడియోలు తొలగించకపోతే చర్యలు తప్పవని రామ్ చరణ్ హెచ్చరిక!
- గోప్యతకు భంగం కలిగితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్!
- అభిమానుల అత్యుత్సాహం.. బిడ్డ భద్రతపై ఆందోళన!
మెగాస్టార్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. దీంతో రామ్ చరణ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అసలేం జరిగిందో తెలుసా?
కూతురి వీడియోలపై రామ్ చరణ్ సీరియస్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana) దంపతులు ట్విన్స్ పుట్టిన ఆనందంలో ఉన్నారు. ఇక తమ మొదటి బిడ్డ క్లిన్ కారాను పుట్టినప్పటి నుంచి ముఖాన్ని దాస్తున్న చరణ్ నేడు తమ్ముడిని చెల్లెలిని చూసేందుకు తీసుకెళ్లాడు. ఈక్రమంలో.. ఫ్యాన్స్ భారీ ఎత్తున చుట్టుముట్టడంతో.. అతి కష్టం మీద ఆయన లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చరణ్ చేతిలో రెండేళ్ల బిడ్డ ఉందన్న విషయం కూడా మర్చిపోయిన అభిమానులు దారుణంగా ప్రవర్తించారు. వారు చేసిన హంగామాకు క్లిన్ కారా భయపడిపోయింది.
ఇక తన బిడ్డ విషయంలో రామ్ చరణ్ కూడా సహనం కోల్పోయాడు. అయినప్పటికీ ఏమనకుండా.. సిబ్బంది రక్షణలో క్లీన్‌కారా(klinkara)ను జాగ్రత్తగా తీసుకుని ఆసుపత్రిలోకి వెళ్లాడు. ఇక మెగా ప్రిన్సెస్ కూడా తన చేతి అడ్డుపెట్టుకుని ముఖాన్ని కనిపించకుండా చేసింది. అయినప్పటికీ కొందరు తమ మొబైల్స్‌తో వీడియోలు తీయగా.. వాటిని నెట్టింట షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, రామ్ చరణ్ టీమ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు అపోలో హాస్పిటల్ దగ్గర ఫ్యాన్స్ అత్యుత్సాహం వల్ల క్లిన్ కారా విజువల్స్ పలు కెమెరాలలో రికార్డ్ అయ్యాయి వాటిని కనుక పబ్లిష్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. గోప్యతా ఉల్లంఘన కారణంగా రామ్ చరణ్’కు తెలియకుండా వాటిని షేర్ చేయొద్దని అన్నారు.
గోప్యతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు!
అభిమానుల అత్యుత్సాహంపై చరణ్ ఆగ్రహం!
రామ్ చరణ్ తీసుకునే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్లిన్ కారా వీడియోల వ్యవహారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


