|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్‌చ‌ర‌ణ్ ‘పెద్ది’ ఊచ‌కోత! 300 కోట్ల క్ల‌బ్‌లో మెగా సునామీ!

Published: 09-06-2026, 6:32 AM
రామ్‌చ‌ర‌ణ్ 'పెద్ది' ఊచ‌కోత! 300 కోట్ల క్ల‌బ్‌లో మెగా సునామీ!
  • రామ్‌చ‌ర‌ణ్ ‘పెద్ది’ ఊచ‌కోత! 300 కోట్ల క్లబ్‌లో మెగాపవర్‌స్టార్ చరిత్ర సృష్టించాడు, రికార్డుల మోత.
  • కేవలం ఐదు రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో బాక్సాఫీస్ బద్దలు.
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, జాన్వీకపూర్ కథానాయికగా వచ్చిన ‘పెద్ది’ భారీ విజయం సాధించింది.
  • తొలి రోజున 135.36 కోట్ల గ్రాస్ వసూళ్లతో మెగాపవర్‌స్టార్ తన సత్తా చాటి, రికార్డులు తిరగరాశాడు.

మెగాపవర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అభిమానుల‌కు పండగే! ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్‌లో చేరి, సరికొత్త రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మెగా సునామీ విశేషాలు మీకోసం!

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సునామీ

Peddi Collections : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన పెద్ది మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. మూడు వంద‌ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది. విడుద‌లైన ఐదు రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ మూవీ 315 కోట్ల‌కు పైగా గ్రాస్ వసూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది.

5 రోజుల్లో 300 కోట్ల రికార్డు!

బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ క‌థానాయిక‌గా న‌టించింది. తొలి రోజున ఈ చిత్రం 135.36 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఈ చిత్రం రానున్న రోజుల్లో మ‌రిన్ని రికార్డును బ‌ద్ద‌లు కొట్టే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు.

మెగాపవర్‌స్టార్ సత్తా చూపించిన పెద్ది

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా ఈ మూవీని నిర్మించ‌గా.. జ‌గ‌ప‌తి బాబు, దివ్యేందు, బొమ‌న్ ఇరానీ, ర‌వి కిష‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న, గ్రామీణ నేప‌థ్యం, క్రీడ‌ల అంశాలు, ఎమోష‌న‌ల్ కంటెంట్‌కు ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటున్నాయి.

‘పెద్ది’ విజ‌య‌యాత్ర ఇలాగే కొన‌సాగే అవ‌కాశం ఉంది. రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో ఇది మరో మైలురాయి. మరిన్ని బాక్సాఫీస్ అప్‌డేట్స్ కోసం మా ఛానెల్‌ను ఫాలో అవుతూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.