|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి రెండో పాట వచ్చేస్తోంది.. తేదీ లాక్! మెగా ఫ్యాన్స్ రచ్చ!

Published: 04-01-2026, 11:30 PM
రామ్ చరణ్ 'పెద్ది' నుంచి రెండో పాట వచ్చేస్తోంది.. తేదీ లాక్! మెగా ఫ్యాన్స్ రచ్చ!
  • గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది.
  • మొదటి పాట ‘చికిరి చికిరి’ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారి హైప్ పెంచింది.
  • రెండో పాట సంక్రాంతి కానుకగా విడుదల కానుంది, అంచనాలు భారీగా ఉన్నాయి.

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ నటించిన ‘పెద్ది’ సినిమా నుంచి మెగా ఫ్యాన్స్‌కు అద్భుతమైన అప్‌డేట్. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ పాట సూపర్‌హిట్‌గా నిలవగా, ఇప్పుడు రెండో పాట విడుదల తేదీ ఖరారైంది. సంక్రాంతి కానుకగా రానున్న ఈ సింగిల్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

‘పెద్ది’ సినిమా విశేషాలు

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌(Ram Charan) హీరోగా నటిస్తున్న రూరల్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘పెద్ది’(Peddi). ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా(Buchi Babu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే శివరాజ్‌ కుమార్‌(shiva Raj Kumar), జగపతిబాబు(Jagapathi Babu), దివ్యేందు శర్మ(Divyendu Sharma) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్‌.రెహమాన్‌(AR Rahman) సంగీతాన్ని అందిస్తున్నారు.

మొదటి పాట ‘చికిరి చికిరి’ సక్సెస్

ఇక ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’(Chikiri Chikiri) సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారి సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ బయటికొచ్చింది. సంక్రాంతి కానుకగా రెండో పాటను విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ‘చికిరి చికిరి’ సూపర్‌హిట్‌ కావడంతో.. రెండో పాట మీద మరింత అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రెండో సింగిల్ ఎప్పుడంటే?

ఎపిక్ మూవీ నుంచి కడలి పోస్టర్ రిలీజ్.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

‘పెద్ది’ సినిమాలోని మొదటి పాట సృష్టించిన ప్రభంజనం తర్వాత, రెండో సింగిల్ కోసం అంచనాలు తారాస్థాయికి చేరాయి. సంక్రాంతి పండుగకు ఈ కొత్త పాట రామ్‌చరణ్‌ అభిమానులకు పండుగ వాతావరణాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. సినిమాపై ఆసక్తిని ఇది మరింత పెంచుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.