
దర్శకుడు పూర్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఏ మాస్టర్ పీస్” సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ. శ్రీరాముడి వనవాసం వరం ఆధారంగా ఈ సినిమా కథ రూపొందించబడింది. అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తున్నారు.
Key Points
శ్రీరాముడి వనవాసం వరం ఆధారంగా సూపర్ హీరో కథ
అరవింద్ కృష్ణ హీరోగా, మనీష్ గిలాడ విలన్‌గా
పురాణాల నుండి స్ఫూర్తి పొందిన కథాంశం
క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది
ఏ మాస్టర్ పీస్ సినిమా విశేషాలు
శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్”. హీరో అరవింద్ కృష్ణ, గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి పూర్వాజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రూల్స్‌లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. “ఏ మాస్టర్ పీస్” సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్స్‌పీరియెన్స్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఏ మాస్టర్ పీస్ క్లైమాక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు.
తాజాగా సెప్టెంబర్ 8న ఏ మాస్టర్ పీస్ షూటింగ్ కవరేజ్‌కు మీడియా మిత్రులను ఆహ్వానించారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ పూర్వాజ్, నిర్మాతలు, తదితరులు తమ అభిప్రాయాలు, సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నారు.
దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ.. “ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్ కవరేజ్‌కు వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్ మొదలయ్యేందుకు శ్రీకాంత్ కండ్రేగుల గారు కారణం. ఆ తర్వాత మనీష్ గిలాడ మా చిత్ర ప్రొడక్షన్‌లో భాగమై సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ఈ చిత్రంలో సూపర్ విలన్‌గా నటిస్తున్నారు” అని అన్నారు.
పురాణాల నుండి స్ఫూర్తి
” అరవింద్ కృష్ణ కెరీర్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఏ మాస్టర్ పీస్ చిత్రంలో సూపర్ హీరోగా ఆయన కనిపిస్తారు. ఈ చిత్ర కథను మన పురాణా ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశాను” అని పూర్వాజ్ చెప్పారు.
“దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది. ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో క్యారెక్టర్‌ను, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఒక అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశాం” అని డైరెక్టర్ తెలిపారు.
“శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా స్క్రిప్ట్‌ను ఏ మాస్టర్ పీస్ చిత్రంలో చూస్తారు. అరవింద్ కృష్ణ సూపర్ హీరోగా అద్భుతంగా పర్‌ఫార్మ్ చేశారు. అలాగే మనీష్ గిలాడ సూపర్ విలన్‌గా ఆకట్టుకుంటాడు. డిఫరెంట్ రోల్స్‌లో జ్యోతి పూర్వజ్ నా వైఫ్, ఎంతో బాగా నటించింది” అని పూర్వాజ్ పేర్కొన్నారు.
నటీనటుల గురించి
“మా టీమ్ అంతా నా వెన్నంటి ఉండి మూవీకి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ కథలో శివుడి నేపథ్యం ఉంటుంది. కాబట్టి మేము అనుకున్న వర్క్స్ అనుకున్నట్లు జరిగితే మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పుకొచ్చారు దర్శకుడు పూర్వాజ్.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యోగి పోసాని మాట్లాడుతూ.. “ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్‌తో పాటు వీఫ్ఎక్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నాం. క్లైమాక్స్ షూటింగ్ ఎంత గ్రాండ్గా చేస్తున్నామో మీకు చూపించాలనే మీడియా మిత్రులను ఇన్వైట్ చేశాం” అని అన్నారు.
“ఈ భారీ క్లైమాక్స్‌ను పక్కా ప్లానింగ్‌తో చేస్తున్నాం. ప్రతి టీమ్ మెంబర్ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఏ మాస్టర్ పీస్ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని యోగి పోసాని వెల్లడించారు.
“ఏ మాస్టర్ పీస్” చిత్రం పురాణాల నుండి స్ఫూర్తి పొందిన కొత్త తరహా సూపర్ హీరో సినిమా అని దర్శకుడు పేర్కొన్నారు. క్లైమాక్స్ షూటింగ్ జరుగుతుండటంతో, సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


