
బాహుబలి శివగామి రమ్యకృష్ణ కొత్త అవతార్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ‘పోలీస్ స్టేషన్ మైన్ భూత్’ సినిమాలో ఆమె మాసీ లుక్ వైరల్ అవుతోంది. ఈ పాత్ర దెయ్యం కాదని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చినా, అభిమానులు మాత్రం షాక్‌లో ఉన్నారు.
Key Points
బాహుబలి తర్వాత రమ్యకృష్ణకు శివగామి పాత్రతో మరింత గుర్తింపు.
రామ్ గోపాల్ వర్మ 'పోలీస్ స్టేషన్ మైన్ భూత్' సినిమా కోసం కొత్త లుక్.
రమ్యకృష్ణది దెయ్యం పాత్ర కాదని ఆర్జీవీ స్పష్టం చేశారు.
శివగామిని ఇలా చూసి ఆశ్చర్యపోయిన అభిమానులు.
శివగామిగా రమ్యకృష్ణ తర్వాత..
రమ్యకృష్ణ పేరు చెప్పగానే ఇప్పటి జనరేషన్‌కి అయితే శివగామి పాత్ర గుర్తొస్తుంది. ఎందుకంటే ‘బాహుబలి’లో ప్రభాస్, రానానే కాదు రమ్యకృష్ణ తన యాక్టింగ్‌తో చూపించిన డామినేషన్.. ఈమె సెకండ్ ఇన్నింగ్స్‌కి మంచి పునాది వేసింది. ఇప్పటికీ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రమ్యకృష్ణ.. మునుపెన్నడూ లేని విధంగా ఓ దెయ్యం సినిమా కోసం కనిపించనుంది. ఆ లుక్స్ ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నాయి.
గత కొన్నాళ్లుగా సినిమాలైతే చేస్తున్నాడు గానీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోతున్న డైరెక్టర్ రాంగోపాల్ వర్మ.. ప్రస్తుతం ‘పోలీస్ స్టేషన్ మైన్ భూత్’ అనే హారర్ మూవీ తీస్తున్నాడు. మనోజ్ బాజ్‌పాయ్ పోలీస్‌గా చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఈ చిత్రం గురించి చెప్పిన ఆర్జీవీ.. ఓ డాన్ చనిపోయి దెయ్యమవుతాడని, తర్వాత పోలీసులని ఎలా ఇబ్బంది పెట్టాడనేది కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చాడు.
రామ్ గోపాల్ వర్మ సినిమాలో రమ్యకృష్ణ లుక్
ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా నటిస్తోందని, ఆమె లుక్ ఇదేనంటూ ఆర్జీవీ రెండు ఫొటోలని పోస్ట్ చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా మాసీగా కనిపించింది. చేతిలో సిగరెట్, ముఖంపై బొట్లు, జీన్స్ ప్యాంట్ ఇలా టామ్ బాయ్ తరహాలో కనిపించింది. అయితే ఈమెది దెయ్యం పాత్ర కాదని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్‌గానే ‘బాహుబలి’ మూవీ ఎపిక్ పేరిట రిలీజైంది. దీంతో ఆ మూవీ లవర్స్.. మా శివగామిని ఇలా మార్చేశారేంటి? అని మాట్లాడుకుంటున్నారు.
దెయ్యం పాత్ర కాదన్న ఆర్జీవీ: ఫ్యాన్స్ రియాక్షన్స్
రమ్యకృష్ణ మాసీ లుక్ పట్ల అభిమానుల్లో చర్చ నడుస్తోంది. ఆర్జీవీ క్లారిటీతో ఈ పాత్రపై ఆసక్తి మరింత పెరిగింది. ఈ కొత్త సినిమాలో ఆమె నటన ఎలా ఉంటుందో చూడాలి.


